
'రామాయణ' తో తాను ఎంత పవర్ ఫుల్ నటినో మరోసారి సాటి చెప్పింది సాయి పల్లవి. సాక్షాత్తు సీతమ్మ వారే సెల్యులాయిడ్ పైకి వచ్చారా అనేలా విజృంభించింది. పార్ట్ 2 లో అంతకు మించి ఉంటుందనే మాట ఇప్పట్నుంచే చాలా కట్టుదిట్టమైన భద్రతతోనే తిరుగుతూ ఉంది.
తాజాగా సాయిపల్లవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన మరియు ఎంతో సరదాగా ఉండే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సినిమాల్లోకి రాకముందే ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ సాయిపల్లవి ఫోన్ నంబర్‌ను తన కాంటాక్ట్ లిస్ట్‌లో 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్నారట.
సాయిపల్లవి కేవలం నటిగానే కాకుండా ఒక అద్భుతమైన డ్యాన్సర్‌గా ఎంతో మంది హృదయాలని గెలుచుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా కాలం ముందే, అంటే ఆమె ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న రోజుల నాటి నుంచి ఆమె ప్రతిభను గమనించిన ఒక ప్రముఖ దర్శకుడు ఆమెతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

ఆ సమయంలోనే ఆమె భవిష్యత్తుపై నమ్మకంతో తన ఫోన్‌లో సాయి పల్లవి నంబర్‌ని 'హీరోయిన్' (Heroine) అని ఎంతో ముద్దుగా సేవ్ చేసుకున్నట్లు ఆ డైరెక్టర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇది కూడా చదవండి:రమ్యకృష్ణ మొదటి సంపాదన ఎంతో తెలుసా? సినిమాల్లోకి రాకముందే ఆమె ఏం చేశారంటే!
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాజ్ కుమార్ పెరియ స్వామి. అదేనండి ఈ నెల 20 న ఓం తో వస్తున్న డైరెక్టర్.. సాయి పల్లవి, రాజ్ కుమార్ కాంబోలో ఇప్పటికే అమరన్ వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

[Sai Pallavi. Om. Raj Kumar Peria Swamy, Dhanush, Mammotty]






