Home

»

Latest News

Sai Pallavi: ఏక్ దిన్ ప్లాప్ పై సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్.. అమీర్ ఖాన్ కి ఏమని చెప్పారు 

May 7, 2026 12:39PM

 

 

సాయి పల్లవి(Sai pallavi),అమీర్ ఖాన్(Aamir Khan)కుమారుడు జునైద్ ఖాన్(JUnaid Khan)ఈ నెల 1 న  'ఏక్ దిన్'(Ek Din)తో థియేటర్స్ ల్యాండ్ అయ్యారు. డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోగా కనీస కల్లెక్షన్స్ కి కూడా రాబట్టలేకపోతుంది. ఈ విషయంపై ట్రేడ్ వర్గాల వారు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రం పరాజయం గురించి సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఆమె మాట్లాడుతూ ప్రీమియర్ షో చూసిన తర్వాత 'ఏక్ దిన్ లోని క్యారక్టర్ కి సరిపోలేదని అనిపించింది. ఇదే విషయాన్నీ అమీర్ సార్ తో చెప్పాను. సదరు క్యారక్టర్ కి నన్ను కాకుండా చురుగ్గా, హుషారుగా ఉండే అమ్మాయిని ఎంపిక చేయాలసింది. అలాంటి నటి అయితే ఆ క్యారక్టర్ కి సరైన న్యాయం చేసే వాళ్ళని చెప్పానని చెప్పింది.  ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.


ALso read: Nani: నాని ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ అగ్ర హీరో ప్రాజెక్ట్ నే కారణమా!

సాయి పల్లవి ప్రస్తుతం రామాయణలో సీతమ్మ తల్లిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఏక్ దిన్ హిందీలో తొలి మూవీ. అమీర్ ఖాన్ నే నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం  వహించాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com