నా వల్ల చాలా మంది అట్రాసిటీ కేసులో ఇరుక్కున్నారు
on Jan 25, 2025
హీరోగా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,ప్రముఖనటుడు సాయికుమార్(Sai kumar)సినీ ప్రస్థానం గురించి,సినీ ప్రేమికులందరికి తెలిసిన విషయమే.ముఖ్యంగా 1996లో ఆయన హీరోగా కన్నడంలో తెరకెక్కిన 'పోలీస్ స్టోరీ'(Police Story)సినిమా అయితే దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రభంజనం.తెలుగులో కూడా ఘన విజయాన్ని సాధించడంతో పాటు రికార్డు స్థాయి వసూళ్ళని అందుకుంది. కన్నడనాట అయితే ఇక చెప్పక్కర్లేదు.'పోలీస్ స్టోరీ' తో సాయికుమార్ ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయ్యాడు.
రీసెంట్ గా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు అమ్మ చనిపోయాక ఆమె రాసిన డైరీ చదివాను.దాంతో అమ్మ పుట్టిన ఊరైన 'భాగేపల్లి' కి ఏదైనా చెయ్యాలని అనుకున్నాను దాంతో 2008 ఎలక్షన్స్ లో భాగేపల్లి నుంచి నాకిషమైన బిజెపీ పార్టీ నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేసి ఓడిపోయాను. ఆ నియోజక వర్గంలో గత యాభై ఏళ్ళ నుంచి బిజెపీ కి 2000 ఓట్లు కూడా రాలేదు.అలాంటిది నాకు 27000 ఓట్లు వచ్చాయి.నాతో పాటు కార్యకర్తలందరు పోటీ చెయ్యడంతో ఆ ఓట్లు వచ్చాయి.కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక కుటుంబ బాధ్యతల మీద దృష్టి పెట్టి నియోజక వర్గానికి దూరమయ్యాను. దాంతో నన్ను నమ్ముకున్న కార్యకర్తలని వదిలేయాల్సి వచ్చింది.నేను ఆ విధంగా చెయ్యడంతో చాలా మంది కార్యకర్తలు అవతలి వైపు వాళ్ల నుంచి టార్చర్ కి గురయ్యారు.సాయికుమార్ కి పని చేశారు కదా ఇప్పుడు మీ సంగతి చూస్తామనెంతలా యాంటీ అయ్యారు.చాలా మందిని అట్రాసిటీ కేసులో కూడా ఇరికించారు.అవన్నీ నాకు చాలా బాధనిపించాయి.ఆ తర్వాత నియోజకవర్గంకి మొహం చూపించలేకపోయాను.ఓడిపోయినా అక్కడే ఉండి ఉంటే 2013 లో ఖచ్చితంగా గెలిచేవాడిని.ఆ విషయం నాకు తెలుసనీ చెప్పుకొచ్చాడు,సాయికుమార్ ఇటీవల సరిపోదా శనివారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో తన సత్తా చాటాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
