
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. నిన్న గురువారం నాడు హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా తన స్నేహితురాలు అయిన కిరణ్మయితో నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఉంగరాలు మార్చుకుని వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. ఈ వేడుక మెగా కాంపౌండ్‌లో పండుగ ವాతావరణాన్ని నింపింది.నిశ్చితార్థ వేడుకకు అత్యంత ప్రాధాన్యత లభించడానికి ప్రధాన కారణం కొణిదెల మరియు అల్లు కుటుంబాల గ్రాండ్ రీ-యూనియన్.
గత కొంతకాలంగా వేర్వేరు కార్యక్రమాల్లో కనిపించిన మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ శుభకార్యం కోసం ఒకే చోట చేరి సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వీరితో పాటు నాగబాబు, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, అల్లు శిరీష్, అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మరియు కుమార్తె ఆద్య ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
ఇది కూడా చదవండి: Summer Holidays Movie Review Telugu: సమ్మర్ హాలిడేస్ మూవీ రివ్యూ
వేడుక ముగిసిన వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థ ఫోటోను పంచుకుంటూ నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. "#KiranTejForever"అనే హాష్‌ట్యాగ్‌తో చరణ్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో మెగా, అల్లు హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో నిలిచిన పిక్చర్ టాలీవుడ్ వర్గాల్లోను, అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సినీ ప్రముఖులు మంచు మనోజ్-భూమా మౌనిక, నటుడు నవదీప్, దర్శకుడు వెంకీ కుడుముల, కమెడియన్ హర్ష చెముడు తదితరులు హాజరై జంటని ఆశీర్వదించారు.
మీకు నచ్చవచ్చు : ఇద్దరిలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది ఆ హీరోనే: ఆ హీరో ఫ్యాన్స్ ఫీలవ్వద్దు!
మీకు నచ్చవచ్చు :గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!
[Sai Durgha Tej Engagement, sai durgha tej fiancée kiranmayi, mega family engagement photos, ram charan allu arjun mega reunion, sai dharam tej wedding date, Tollywood, Tolywood News, Telugu Cinema, Telugu Cinema News]






