
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఫుల్ బిజీగా ఉన్నారు . దీంతో ఓజి సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్లి, కంప్లీట్ చేసుకొని, తమ ముందుకొస్తుందా అని ఎదురుచూడని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు.
అసలు విషయానికి వస్తే ఈ రోజు సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులతో FNCC లో ముచ్చటించాడు. ఒక అభిమాని' మామ పవన్ కళ్యాణ్ తో మూవీ ఎప్పుడు అని అడిగాడు. అందుకు సాయి దుర్గ తేజ్ బదులిస్తూ ఆల్రెడీ బ్రో చేశాను బ్రో. నువ్వు చూడకపోయి ఉంటే ఓటిటిలో వెళ్లి చూడు. అయినా తప్పు మాదే.బ్రో ని సరిగ్గా మేము ప్రమోట్ చేయలేదని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: ఆ కామెడీ కింగ్ నోటి నుంచి మాట వస్తే నవ్వులే.. కానీ 35 ఏళ్లకే రైల్వే ట్రాక్ పక్కన శవమై!

బ్రో మూవీ 2023 లో విడుదలవ్వగా ఆశించినంత విజయాన్ని మాత్రం అందుకోలేదనేది సినీ సత్యం. ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు' తో బిజీగా ఉన్నాడు. 2027 జనవరి 12 రిలీజ్ డేట్.
[Sai Durgha Tej About Pawan Kalyan, Sai Durgha Tej, Pawan Kalyan, Bro Movie, Sambarala Etigattu, Tollywood News, Mega Hero, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





