Home

»

Latest News

మెగా వేడుక: సాయి ధరమ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరో తెలుసా.?

Oct 21, 2026 10:44AM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నవంబర్‌లోనే ఆయన వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సాయి తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

నిజానికి సాయి తేజ్ పెళ్లి గురించి గతంలోనూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈసారి మాత్రం నిశ్చితార్థం తేదీతో సహా కొన్ని వివరాలు తెరపైకి రావడంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 5న తేజ్ నిశ్చితార్థం జరగనుందని, నవంబర్‌లోనే వివాహ వేడుక కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సాయి తేజ్ పెళ్లి గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన చేసుకోబోయే అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలేనట. వీరిద్దరి మధ్య చాలాకాలంగా స్నేహం ఉందని, ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ బంధం పెళ్లి వరకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆమె ఎవరనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? అన్న విషయంలోనూ స్పష్టత లేదు.

మరోవైపు, సాయి తేజ్ పెళ్లి గురించి గత ఏడాదే ఓ క్లారిటీ ఇచ్చారు. 2025 నవంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. 2026లో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాకు వెల్లడించారు. దీంతో ఇప్పుడు వినిపిస్తున్న పెళ్లి వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఆయన భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లు కేటాయించిన తేజ్.. తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఆశల హరివిల్లు.. కొత్త లోకంలోకి తీసుకెళ్ళే సిరివెన్నెల సాహిత్యం.!

 

 

 

[Sai Dharam Tej Wedding, Sai Dharam Tej Marriage, Sai Dharam Tej Engagement, Sai Durgha Tej Wedding, Sai Dharam Tej, Sai Durgha Tej, Mega Family Wedding, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com