Home

»

Latest News

s saraswathi: ఎస్. సరస్వతి హైలెట్స్ ఇవే.. వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇస్తున్నారు

Mar 6, 2026 10:12AM

 

-ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఎస్ సరస్వతి 
-టాక్ పరిస్థితి ఏంటి!
-ప్రేక్షకులు చెప్తున్న హైలెట్స్ నిజమేనా!

నేషనల్ యానిమల్, నేషనల్ బర్డ్ ని చంపితే నో బెయిల్. మరి ఆడపిల్లని రేప్ చేసినా, చంపినా బెయిల్ ఇస్తున్నారు. ఇలా ఎందుకు అనే పాయింట్ ని రేజ్ చేస్తు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఎస్. సరస్వతి(S. Saraswathi). వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)టైటిల్ రోల్ పోషించడంతో పాటు దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరించింది. ప్రకాష్ రాజ్(Prakash Raj),ప్రియమణి (Priyamani),రాధికా శరత్ కుమార్, నాజర్, రంగం ఫేమ్ జీవా, ఓజి కిషోర్ ముఖ్యమైన క్యారెక్టర్స్ పోషించారు. మూవీ చూసిన ప్రేక్షకుల దగ్గర్నుంచి అయితే పర్వాలేదనే టాక్ వినపడుతుంది. ప్రధానంగా కొన్ని అంశాలు బాగా అలరించాయని, మూవీకి అవే హైలెట్స్ అని చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం. 

1 .కథ
2 .ఆల్ ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ 
3 . కోర్టు డ్రామా 
4 . ఇంటర్వెల్ ఎపిసోడ్ 
5 .సెకండ్ హాఫ్ లో సరస్వతి చైల్డ్ ఎపిసోడ్ 
6 . సరస్వతి, ఆదిత్య మధ్య వచ్చిన ట్విస్ట్  
7 . ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ 

ఈ ఏడూ అంశాలే సరస్వతికి ప్రధాన హైలెట్ గా నిలిచాయని ప్రేక్షకులు చెప్తున్నారు.  రివ్యూస్ కూడా పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి. మెజారిటీ రివ్యూస్ ని ఒకసారి చూసుకుంటే 'ఇలాంటి కథలు సిల్వర్ స్క్రీన్ పై చాలానే వచ్చాయి. కథనం విషయంలో మరింత శ్రద్ద వహించి  క్యూరియాసిటీ కలిగించే విధంగా సన్నివేశాలని మలుచుకొని ఉండాల్సింది. దీంతో సరస్వతి మరింత బెటర్ పొజిషన్ లో ఉండేది. ప్రెజెంట్ సొసైటీ ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యని కథా వస్తువుగా ఫిక్స్ చేసుకొని వ్యక్తిగత పగ వైపు ఎక్కువగా ఫోకస్ చేయడంతో సరస్వతి  బ్లాక్ బస్టర్ ని దూరం చేసుకున్నట్లయిందని మెజారిటీ రివ్యూల అభిప్రాయం.

also read: s saraswathi movie review: ఎస్. సరస్వతి మూవీ రివ్యూ 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com