
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్‌టైమ్‌తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి.
ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.
[Romanchakam, Movie Review, Sandeep Reddy Vanga, Sumanth Prabhas, Ananthika Sanilkumar, Telugu Film News, Telugu News]





