హీరోయిన్ హోదాలో ఉత్తమ మహిళగా రోజా పేరు నామినేట్
Nov 20, 2024 11:04AM
.webp)
హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి,తన అద్భుతమైన నటనతో, డాన్స్ లతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న నటి రోజా(roja)ఆ పై రాజకీయ తెరంగ్రేటం కూడా చేసి ఎంఎల్ఏ గా, మంత్రిగా కూడా బాధ్యతలని నిర్వహించింది.గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజా రీసెంట్ గా మాట్లాడుతూ ఇప్పటి తెలుగుదేశం ఆద్వర్యంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందుకు మహిళలని కూడా చూడకుండా అసభ్య పోస్ట్ లు చెయ్యడంతో పాటుగా అరెస్ట్ లు చేస్తున్నారని మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.
ఇప్పడు ఆమె మాటలపై ప్రముఖసోషల్ మీడియా యాక్టవిస్ట్ సంతు బాబు(santhu babu)మాట్లాడుతూ పవన్ కళ్యాణ్(pawan kalyan)చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఇళ్లల్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు రోజా ఎంధుకు మాట్లాడలేదు.వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఆడవాళ్లు కాదా. పైగా ఆమె ఎవరి తరుపున అయితే మాట్లాడుతుందో వాళ్లంతా సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత జుగుప్సాకరంగా తిట్టారు. అలాంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసారని చెప్తుంది.దీంతో రోజా నటనకి ఉత్తమ మహిళగా అవార్డు ఇవ్వాలని చెప్పుకొచ్చాడు.




.webp)