Home

»

Latest News

veerabhadrudu: సరికొత్త వివాదంలో వీరభద్రుడు.. తెలుగు ఫ్యాన్స్ ఫైర్ 

May 12, 2026

 


ఎప్పుడు ఎవరితో ఏ అవసరం ఏర్పడుతుందో తెలియదు. కాబట్టి అనవసరంగా ఎవర్ని ద్వేషించకూడదు,దూషించకూడదు. కానీ ఒక వేళ అనవసరంగా ఎవరినైనా ద్వేషించినా, దూషించినా సూర్య వన్ మాన్ షో  వీరభద్రుడుకి వచ్చిన పరిస్థితే వస్థుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
 
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వీరభద్రుడు(Veerabhadrudu)తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ నెల 14 న రిలీజ్ అవుతుండటంతో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆర్ జె బాలాజీ గతంలో ఒక ఇంటర్వ్యూ లో మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుతు తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదు. హీరోల ఎలివేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొంత మందైతే ఒక అడుగు ముందుకేసి మన తెలుగు సినిమాని అవమానించి  ఇప్పుడు తన సినిమాని చూడమని ఎలా అడుగుతాడనే కామెంట్స్ చేస్తున్నారు.  


Also read: Raviteja: నిర్మాతలకు అండగా రవితేజ సాహసోపేత నిర్ణయం.. సుమారు 10 కోట్లు కోత!

ఈ విషయంపై సినీ విశ్లేషకులు స్పందిస్తు ఆర్ జె బాలాజీ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో సదరు విషయంపై బాలాజీ స్పందించి మాట్లాడాలని లేదంటే వీరభద్రుడుపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాలాజీ స్పందిస్తాడేమో చూడాలి. నిన్న జరిగిన ఈవెంట్ లో మాత్రం తెలుగు ప్రేక్షకులపై, హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ రామ్ చరణ్  కి వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు 

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com