Home

»

Latest News

రియాలిటీ సెకండ్ సాంగ్: 'రుత్తూ' అంటూ ప్రేమలో ముంచేస్తున్న కిరణ్ అబ్బవరం.!

Nov 13, 2026 3:22PM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రియాలిటీ'. ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట 'రుత్తూ' ఇప్పుడు సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేమలో పడిన ఇద్దరి మనసుల్లో కలిగే అందమైన భావాలను చాలా సింపుల్‌గా, వినసొంపైన సంగీతంతో ఈ పాటలో చెప్పే ప్రయత్నం చేశారు.

ప్రేమలో పడితే ప్రపంచమే కొత్తగా కనిపిస్తుందా?. అవును.. ఈ పాటలో ప్రధానంగా కనిపించే భావం ఇదే. ఒకరిని చూసినప్పుడు కలిగే ఆనందం, వారి చిన్న చిన్న చూపుల్లోనే సంతోషాన్ని వెతుక్కోవడం, వాళ్లతో మాట్లాడిన క్షణాలను పదే పదే గుర్తు చేసుకోవడం.. ఇలా ప్రేమలో పడిన వ్యక్తి మనసులో జరిగే మార్పులను పూర్ణాచారి తన సాహిత్యంలో అందంగా ఆవిష్కరించారు.

సాధారణంగా మాస్ బీట్స్, ఫాస్ట్ రిథమ్స్‌తో పాటలను హిట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు మంచి గుర్తింపు ఉంది. కానీ 'రుత్తూ' పాటలో మాత్రం ఆయన తనలోని మరో సంగీత దర్శకుడిని పరిచయం చేశారు. పెద్దగా హడావుడి చేసే మ్యూజిక్ కాకుండా.. మెలోడీకి ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ పాటకు కపిల్ కపిలన్ గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమలోని సున్నితమైన భావాలను పలికించడానికి ఆయన వాయిస్ చక్కగా సరిపోయింది. పాటలోని భావోద్వేగానికి తగ్గట్టుగా మృదువుగా పాడారు. ముఖ్యంగా మెలోడీని ఎంజాయ్ చేసే వారికి ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?

పూర్ణాచారి సాహిత్యం, భీమ్స్ సంగీతం, కపిల్ కపిలన్ గాత్రం.. ఈ మూడు అంశాలు ఒకదానికొకటి చక్కగా కుదిరాయి. పాటలో కిరణ్ అబ్బవరం, దేవిక భట్ మధ్య కెమిస్ట్రీ కూడా సహజంగా కనిపిస్తోంది. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, బీచ్ దగ్గర రొమాంటిక్ మూమెంట్స్, ఫోన్ సంభాషణలు.. ఇవన్నీ ఒక అందమైన ప్రేమకథను గుర్తు చేస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి జీవితాన్ని చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'భజగోవిందం' పాట మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాట 'రుత్తూ'తో మరోసారి సంగీత ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 25, 2026న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చవచ్చు:
ENE Repeat బతుకమ్మ సాంగ్.. శ్రేయా ఘోషల్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్ అదుర్స్.!
టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా.. ఈ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్ లిరిక్స్‌లో ఉన్న మ్యాజిక్ తెలుసా.?

 

 

 

[Rutthuu Song, Reality Movie, Kiran Abbavaram, Devika Bhatt, Bheems Ceciroleo]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com