
నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్ దర్శకత్వంలో లెల్లా రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ ని.. శ్రీహరి పుట్టినరోజు(ఆగస్టు 15) సందర్బంగా చిత్ర బృందం తాజాగా విడుదల చెసింధి. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్ కి అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్ శ్రీహరి కూడా కనిపిస్తుండటంతో ఈ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా మారింది.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శరవేగంగా ముస్తాబవుతోంది. త్వరలో చిత్ర బృందం గ్రాండ్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ జరగబోతుందని ప్రకటించింది. ఈ ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
Real Star Srihari, Birthday, Pothuraju, First Look






