
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న #RC17 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తొలుత అక్టోబర్ 20న పూజా కార్యక్రమం నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు సమాచారం.
అక్టోబర్ 20న అనుకున్న పూజా కార్యక్రమానికి అనుకూలమైన ముహూర్తం లేకపోవడంతో.. అక్టోబర్ 25 తర్వాత మరో మంచి ముహూర్తాన్ని చూసి సినిమాను లాంఛనంగా ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే కొత్త తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరులో ప్రారంభోత్సవం ఉంటుందా? లేదా మరింత ఆలస్యమవుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రొడక్షన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 14న ఆ కార్యాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే అది సినిమా ప్రారంభోత్సవం కాదని, అసలు లాంచ్ ఈవెంట్‌ను తర్వాత నిర్వహించనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ముహూర్తం కారణంగా ఆ కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ జోడీ.. ‘పుష్ప’ సిరీస్ తర్వాత సుకుమార్ తెరకెక్కించనున్న కొత్త ప్రాజెక్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ కలెక్షన్స్.. నాగవంశీ నమ్మకం నిలబడినట్టేనా.?
[RC17 Pooja Ceremony Postponed, RC17 Movie Launch, Ram Charan Sukumar Movie, Ram Charan New Movie, Ram Charan, Sukumar, RC17 Movie, Dasara 2026, Telugu Film News]




