Home

»

Latest News

Jayam Ravi: గర్ల్ ఫ్రెండ్ తో  జయం రవి ప్యాచప్.. అసలేం జరుగుతుంది!

Jun 11, 2026 10:26AM

 

జయం రవి(Jayam Ravi)ఆర్తి(aarti)విడాకులకి కారణం ప్రముఖ గాయని, డాక్టర్ కెనీషా ఫ్రాన్సిస్(Kenisha Francis)నే కారణం అని వార్తలు రావడం, జయం రవి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని కెనీషా చెప్పడం ఇలా అన్ని  చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం జయం రవి, ఆర్తి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది.  
 
ఇప్పుడు తాజాగా కెనీషా, జయం రవి మళ్లీ ప్యాచప్ అయ్యారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రవి  వ్యక్తిగత జీవితంలో ఇటీవలి కాలంలో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి భార్య ఆర్తీతో వివాదం, కోర్టు చుట్టూ తిరగడం వంటి ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఆయన ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో ఆయనకి  ఉన్న సన్నిహిత సంబంధం గురించి నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. అయితే ఆ మధ్య వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని, ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని, దాదాపుగా  వీరి బంధం ముగిసిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రవి మోహన్, కెనీషా మళ్లీ ఒకటయ్యారని  సోషల్ మీడియాలో సడన్ గా వచ్చిన కొన్ని పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

కొందరు నెటిజన్లు ఈ వార్తలపై స్పందిస్తూ.. ఇది నిజమైన ప్రేమకి  నిదర్శనమని, ఎన్ని అపార్థాలు మరియు విభేదాలు వచ్చినా చివరికి ఒకరినొకరు అర్థం చేసుకుని తిరిగి కలిసే బంధాలే ఎంతో బలమైనవని కామెంట్స్  చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం  నిజంగానే వీరిద్దరూ కలిశారా లేక ఇదంతా కేవలం వ్యూస్ కోసం క్రియేట్ చేసిన ఊహాగానాలేనా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com