Home

»

Latest News

Ravi Babu: పెద్ది సినిమా వస్తుందని తెగ హడావుడి చేశారు.. రవిబాబు షాకింగ్ కామెంట్స్!

May 02, 2026

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం ఒక ఎత్తైతే, రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం మరో పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు (Ravi Babu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రవిబాబు నటిస్తూ దర్శకత్వం వహించిన 'రేజర్' (Razor) సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆయన తెలుగువన్ (TeluguOne) కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో.. తమ సినిమా విడుదలతేదిపై రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తెలిపారు.

మే 1 రిలీజ్ అనుకుంటే.. హడావుడి చేశారు!
నిజానికి 'రేజర్' సినిమాను మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు రవిబాబు చెప్పారు. "అయితే, అదేదో పెద్ద సినిమా వస్తుంది అని చెప్పి హడావుడి చేశారు. ఈ పెద్ద సినిమాలన్నీ ఇంతే.. చెప్పిన డేట్ కి రావు పెట్టవు. మిగతా చిన్న సినిమాలన్నీ ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాయి." అని అన్నారు.

ఏప్రిల్ 30న 'పెద్ది'ని విడుదల చేయాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఒకసారి వస్తుందని, ఒకసారి వాయిదా పడుతుందని ఇలా కొద్దిరోజుల పాటు తెగ వార్తలొచ్చాయి. ఈ గందరగోళం కారణంగానే 'రేజర్' రిలీజ్ డేట్ ను మార్చామని రవిబాబు చెప్పుకొచ్చారు. 

అయితే 'రేజర్' కొత్త విడుదల తేదీని మే 8 గా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని రవిబాబు చెప్పారు. తన తండ్రి, దివంగత నటుడు చలపతి రావు పుట్టినరోజు మే 8. ఆయన జయంతి సందర్భంగా 'రేజర్'ను విడుదల చేస్తుండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com