Home

»

Latest News

Rashmika mandanna: 4000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న రష్మిక

Jun 22, 2026 11:18AM

 

రష్మిక మందన్నా(Rashmika mandanna).. పది సంవత్సరాల క్రితం రష్మిక అంటే ఒక మాములు హీరోయిన్. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ తో పాటు పాన్ ఇండియాక్వీన్‌. అనతి కాలంలోనే అంతలా ఎదగడానికి కారణం ఆమె టాలెంట్.  ప్రతి చిత్రంలోని తన క్యారక్టర్ ద్వారా సినిమా రేంజ్ ని పెంచుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని 4,000 కోట్ల మైలురాయిని అధిగమించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిచింది.

 రష్మిక  సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. కేవలం మూడు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా ఆమె ఏకంగా .3,300 కోట్లకి  పైగా గ్రాస్ వసూళ్లని  సాధించింది. పుష్ప  చిత్రం .400 కోట్లు.. వరిసు 300 కోట్లు, యానిమల్ 900 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు ఛావా సినిమా రూ.800 కోట్లు వసూలు చేసింది. 'పుష్ప 2: ది రూల్' హిందీ మార్కెట్లోనే రికార్డు స్థాయిలో 812 కోట్ల నెట్ కలెక్షన్స్ ,'యానిమల్' 502.98 కోట్లు,  'చావా' .700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోయాయి. ఈ వరుస విజయాల జోరుతో రష్మిక మొత్తం బాక్సాఫీస్ మార్కెట్ విలువ 4,000 కోట్ల మార్కును దాటేసింది.

also read: రామ్ పోతినేని,భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారా.. పెళ్లి రూమర్స్‌కి ఊతమిచ్చిన కామెంట్స్!

ఈ ఘనతతో బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు  దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి స్టార్లను రష్మిక వెనక్కి నెట్టింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో దీపికా, ఆలియా మధ్యే నంబర్ వన్ రేసు నడిచేది, కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని రష్మిక తన ఖాతాలో వేసుకుంది. 2023 నుండి దీపికా పదుకొణె నటించిన 5 పెద్ద చిత్రాలు దాదాపు 1,800 కోట్లు రాబట్టగా, ఆలియా భట్ సినిమాలు తక్కువ వసూళ్లకే పరిమితమయ్యాయి. కానీ రష్మిక మాత్రం కేవలం 3 సినిమాలతోనే 3,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం రష్మిక సాధించిన ఈ బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్‌ని అరుదైన విజయంగా ప్రశంసించారు. రష్మిక ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి కాక్ టైల్ 2 తో సందడి చేస్తుంది.
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com