Home

»

Latest News

Rao bahadur: రావు బహదూర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!

Jul 4, 2026 10:29AM

 

విలక్షణ నటుడు సత్యదేవ్, విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో నిన్న థియేటర్స్ లో ల్యాండ్ అయిన మూవీ 'రావు బహదూర్'. సైకలాజికల్ మిస్టరీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం 'రావు బహదూర్' ని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో  సత్యదేవ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. 


మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా 1.61 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతూ 1.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లని  రాబట్టి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా  3.11 కోట్లకి సాధించినట్లయింది.  ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 27.65% ఆక్యుపెన్సీనమోదు కాగా, ఉదయం షోలకు 19.00% ఆక్యుపెన్సీతో నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. మధ్యాహ్నానికి 23.08%, సాయంత్రం షోలకు 25.46% కి పెరిగింది. ఇక నైట్ షోలకైతే ఏకంగా 38.08% ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దుమ్మురేపింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే మొదటి రోజు 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటకలో 13 లక్షలు, తమిళనాడులో  2 లక్షలు రాబట్టింది. ఒక వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


Also read: Nagabandham: నాగబంధం ఫస్ట్ డే కలెక్షన్స్.. ట్రేడ్ వర్గాలు సైతం షాక్!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com