Home

»

Latest News

Ranbir Kapoor: 'రణబీర్'కి విలువైన బహుమతిని కట్టబెట్టిన రాముడు.. ఏకైక భారతీయనటుడిగా రికార్డు 

Apr 16, 2026 11:01AM

 

-రామాయణతో రాముడిని మరిపిస్తున్న రణబీర్ 
-అందరిలో భారీ అంచనాలు
-ఇప్పుడు ఆ రాముడే 'రణబీర్'కి సాయం 
-ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం 

 
స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor)ప్రస్తుతం 'రామాయణ'(Ramayana)లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో రాముడిగా కొన్ని తరాల పాటు తన 'రూపు'నే రామ భక్తుల్లో నిలబడి పోవడం ఖాయమనే సంకేతాలైతే చాలా బలంగా చెప్పాడు. అంతలా  అయోధ్య రాముడిగా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఇప్పుడు ఆ రాముడే రణబీర్ కి అత్యంత విలువైన బహుమతిని కట్టబెట్టాడు. మరి ఆ బహుమతి ఏంటో చూసేద్దాం.


టైం మ్యాగజైన్(Time magazine).. అమెరికా దేశానికి చెందిన ఈ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నికగన్నది, ప్రతిష్టాత్మకమైనది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించే 100 మంది ప్రతిభావంతుల పేర్లని వెల్లడి చేస్తుంది. ఆ జాబితాలో చోటు సంపాదించాలంటే పెట్టి పుట్టాలనే మాట సెలబ్రిటీస్ నోటి వెంట వినిపిస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రణబీర్ నిలిచాడు. రణబీర్ తప్ప మరో భారతీయ నటులు 2026  టైమ్స్ జాబితాలో లేరు. ఓన్లీ రణబీర్ నే ఉన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే గత ఏడాది టైమ్స్ జాబితాలో సినీ పరిశ్రమ నుంచే కాకుండా ఏ రంగం నుంచి కూడా ఒక్క భారతీయుడు స్థానం సంపాదించలేదు. ఈ నేపథ్యంలో రణబీర్ కి ఆ అయోధ్య రాముడే టైం మ్యాగజైన్ 2026 లో చోటు కల్పించాడనే మాటలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.

also read: Ott telugu: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఈ రోజే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్

రామాయణ వరల్డ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. మరో వైపు లెజండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ(Sanjay leela bhansali)దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' ని కూడా రణబీర్ ఇప్పటికే ప్రకటించాడు.

 

     

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com