
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఇద్దరినీ మరోసారి తెరపై చూడాలని ఎదురుచూసిన అభిమానులకు ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు తగ్గట్టుగానే విడుదలకు ముందు నుంచే రణబాలిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది.
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో బ్రిటిష్ పాలన నాటి పరిస్థితులను నేపథ్యంగా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్కు తగ్గట్టుగా యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశించారు. మరోవైపు విజయ్, రష్మిక జంటగా కనిపిస్తుండటంతో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది.
అక్టోబర్ 16న సినిమా విడుదల కావడంతో.. మార్నింగ్ షోల నుంచే నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొందరు విజయ్ నటన, రష్మికతో ఆయన కెమిస్ట్రీని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం కథనం నెమ్మదిగా సాగింది అంటున్నారు. స్క్రీన్ప్లే విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రణబాలిలో కథా నేపథ్యం, విజయ్ దేవరకొండ నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మిక కలిసి కనిపించే సన్నివేశాలు బాగున్నాయంటూ కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా ఉందని, తెరపై చూడటానికి అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్రిటిష్ పాలన నాటి పరిస్థితులను ప్రతిబింబించే సన్నివేశాలు, కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది.

రణబాలి సినిమా ఉద్దేశం బాగున్నప్పటికీ, దాన్ని తెరపై చూపించిన విధానం మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉండటం మైనస్ గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కొంత నెమ్మదిగా సాగిందని, సినిమా నిడివి కూడా తగ్గించి ఉంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిర్మాణ విలువలు, సెట్స్ బాగున్నప్పటికీ.. కథలో భావోద్వేగాలు ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అయ్యేలా ఉండాల్సిందని అంటున్నారు.
ఎంచుకున్న కథ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు వస్తున్న ప్రశంసలు ఒకవైపు.. కథనం, నిడివిపై వస్తున్న విమర్శలు మరోవైపు.. ఇలా రణబాలికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
[Ranabaali Twitter Review, Ranabaali First Review, Ranabaali Review, Ranabaali Public Talk, Ranabaal Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Cinema]




