.webp)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో అక్టోబర్ 16న విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై ఓటీటీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
'రణబాలి' విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దీనికి తోడు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన సినిమా కావడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కానీ థియేటర్లలో మాత్రం సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. బ్రిటిష్ పాలన కాలం, మద్రాస్ కరువు నేపథ్యంలో దర్శకుడు ఓ భారీ కథను చెప్పే ప్రయత్నం చేశారు. విజయ్ నటన, విజువల్స్‌కు ప్రశంసలు వచ్చినా.. కథనం నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో సాగదీత, ఎమోషనల్ కనెక్ట్ తగ్గడం వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది.

థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో సినిమాను చూసే అవకాశం రావడంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక నేపథ్యం, విజయ్ దేవరకొండ నటన, రష్మికతో కెమిస్ట్రీ, బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లూ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.
ఇది కూడా చదవండి: త్రివిక్రమ్, చినబాబు మధ్య విభేదాలు.. 'గాడ్ ఆఫ్ వార్' ఆగిపోయిందన్న వార్తలకు చెక్.!
ఓటీటీ ప్రేక్షకుల నుంచి రణబాలి సినిమాకి మంచి స్పందనే లభిస్తోంది. విజయ్ నటనను ప్రశంసిస్తున్నారు. అలాగే విజయ్-రష్మిక మధ్య సీన్స్ తో పాటు, యాక్షన్ సీన్స్, పతాక సన్నివేశాలు బాగున్నాయని కొనియాడుతున్నారు.

మొత్తానికి థియేటర్లలో నిరాశపరిచిన 'రణబాలి'కి ఓటీటీలో మంచి ఆదరణే లభిస్తోంది. ఇది బ్యాడ్ ఫిల్మ్ కాదని, ఇటీవల విజయ్ నుంచి సినిమాల్లో చాలా బెటర్ ఫిల్మ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు:
శోభన్ బాబుకు స్టార్‌డమ్ తెచ్చిన మూవీ.. 'తాసిల్దార్ గారి అమ్మాయి' వెనుక ఇన్ని విశేషాలా.?
50 ఏళ్ల ‘ఊరుమ్మడి బతుకులు’.. స్టార్ హీరోలు లేకుండానే జాతీయ అవార్డు కొట్టిన సినిమా.!
[Ranabaali OTT Response, Netflix, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan]





