Home

»

Latest News

Ranabaali Movie Review Telugu: రణబాలి మూవీ రివ్యూ 

Oct 16, 2026 12:56PM

-సినిమా పేరు: రణబాలి
-న‌టీన‌టులు: విజయ్ దేవరకొండ, రష్మిక, ఆర్నాల్డ్ ఓస్లో , ఈశ్వరిరావు తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: నిరవ్ షా
-ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
-మ్యూజిక్: అజయ్, అతుల్ 
-నిర్మాత‌లు: నవీన్ ఎర్నేని, రవి యలమంచిలి 
-బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 
-రచన,దర్శకత్వం: రాహుల్ సాంకృత్యాయన్
-రిలీజ్ డేట్ : అక్టోబర్ 16 , 2026
 

విజయ్ దేవరకొండ, రష్మిక ,రాహుల్ సాంకృత్యాయన్, మైత్రి మూవీ మేకర్స్ ఈ రోజు 'రణబాలి'  తో థియేటర్స్ లోకి వచ్చారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో రాయలసీమలో లో జరిగిన యదార్ధ  సంఘటనల  ఆధారంగా తెరకెక్కడం స్పెషల్ ఎట్రాక్షన్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

బొబ్బిలి రణబాలి  (విజయ్ దేవరకొండ) ..పద్నాలుగేళ్ల వయసులోనే సొంత మేనమామని చంపిన ఉడుకు రక్తంతో ఊగిపోతుండే యువకుడు.కొంచం ఆవేశపరుడు కూడా. కత్తి పడితే పదిమంది తలల తీసెయ్యగలడు. రాయలసీమ ప్రాంతంలోని శింగనమల స్వగ్రామం..ఆ ఊరి ప్రజలు పరమేశ్వరుడి అవతారంగా పూజించే మల్లన్న తాతతో మాట్లాడుతుంటాడు. జీవుడు దేవుడిగా మారడం గురించి రణబాలి చెప్తుంటాడు. సర్ హెక్టార్( ఆర్నాల్డ్ ఓస్లో) బ్రిటిష్ అధికారి. మద్రాస్ ప్రెసిడెన్సీ కింద వచ్చే రాయలసీమ ప్రాంతానికి సర్వాధికారి. తన లక్ష్యం కోసం సీమ ప్రజలని చాలా దారుణంగా హింసించే పరమ క్రూరుడు. ఆ క్రమంలో ఎంతో మందిని చంపుతాడు. సీమ ప్రజలు కరువుతో అల్లాడుతూ ఉంటారు. ఎంతలా అంటే తల్లి తన పసిబిడ్డకి చనుపాలు ఇస్తుంటే పాలు రాక పిల్లాడు, ఒంట్లో శక్తీ లేక తల్లి ఇద్దరు చనిపోయేంత కరువు. సర్ హెక్టార్ లక్ష్యం ఏంటి? సీమ ప్రజల కరువుపై రణబాలి చేసిన యుద్ధం ఏంటి? ఆ యుద్ధంలో రణబాలి భార్య జయమ్మ(రష్మిక) క్యారక్టర్ ఏంటి? మల్లన్న తాతతో చెప్పిన జీవుడు దేవుడిగా మారడానికి రణబాలి కి సంబంధం ఏంటి అనేదే రణబాలి  చిత్రం.


ఎనాలసిస్ 

 బ్రిటిష్ వాళ్ళతో  తిరుగుబాటు అనే పాయింట్ రొటీనే అయినా మల్లన్న తాత ప్లాట్ ని  జోడించడం పెద్ద రిలీఫ్. యాక్షన్ సీక్వెన్స్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చవచ్చు. క్లైమాక్స్ లో సాడ్ ఎండింగ్ ఇవ్వకుండా వదిలెయ్యడం కూడా పెద్ద రిలీఫ్. కాకపోతే ఇటువంటి చిత్రాలకి కథనం, డైలాగ్స్  మంచి గ్రిప్ గా ఉండాలి.కానీ ఆ స్థాయిలో లేవు.. రణబాలి బ్రిటిష్ వాళ్ళకి మధ్య వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే రణబాలి పుట్టుక జన్మ రహస్యానికీ సంబంధించి వచ్చిన సన్నివేశం బాగుంది. దీంతో మూవీ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ ఏర్పడింది.  రణబాలి ఇంట్రడక్షన్ సీన్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగున్నాయి. జయమ్మ ఇంట్రడక్షన్,  రణబాలి, జయమ్మ మధ్య వచ్చిన సీన్స్ సూపర్. సినిమా మొత్తానికి హైలెట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కథ సోల్ కి సంబంధించిన సీన్స్ మెప్పించలేకపోయాయి.  రణబాలి తన జీవిత లక్ష్యంగా ఎంచుకునే మార్గాన్నికొన్ని సీన్స్ తో బాగా హైలెట్ చేయాల్సింది. కథ తెలిసిపోతుండటం కూడా మైనస్. బ్రిటిష్ వాళ్ళు ప్రజలని హింసించే సీన్స్ చాలా సినిమాల్లో చూసేసాం. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే రణబాలి సీన్స్ అన్ని రొటీన్ గా ఉన్నాయి. రణబాలి అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు జయమ్మ రావడం ఆ సందర్భంగా సాగిన ఎపిసోడ్ పర్లేదు. ఆకలి చావుల ఎపిసోడ్ సైతం  సో సో. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి 

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

రణబాలి గా విజయ్ దేవరకొండ మెప్పించే స్థాయిలోనే పెర్ఫార్మ్ చేసాడు.యాక్షన్ సీక్వెన్స్ లో కొత్త విజయ్ కనిపించాడు .జయమ్మ గా రష్మిక క్యారక్టర్ నిడివి కొంచం తక్కువే అయినా మరో సారి తన నట విశ్వరూపాన్ని చూపించింది. బ్రిటిష్ అధికారిగా చేసిన ఆర్నాల్డ్ ఓస్లో కూడా తన క్యారక్టర్ కి న్యాయం చేసాడు. రణబాలి తల్లిగా చేసిన ఈశ్వరిరావు, వీరభద్ర తాత గా చేసిన  క్యారక్టర్  తో మిగతా బ్రిటిష్ నటులు, మిగతా అన్ని క్యారెక్టర్స్ తమ పరిధి మేరకు మెప్పించారు.  రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడిగా సక్సెస్ అయినా రచయితగా మెప్పించలేకపోయాడు. ఈ విషయం సెకండ్ హాఫ్ లో వచ్చిన సన్నివేశాలతో ఈజీగా తెలిసిపోతుంటుంది. మైత్రి నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అతి పెద్ద ప్లస్ పాయింట్. సాంగ్స్  బాగోలేదు.

బలాలు
1 . యాక్షన్ సీక్వెన్స్ 
2 . విజయ్ దేవరకొండ, రష్మిక ట్రాక్ 

బలహీనతలు 
1 . నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుండటం 
2 . సెకండ్ హాఫ్ 

 

 ఫైనల్ గా చెప్పాలంటే  విజయ్ దేవరకొండ గత చిత్రాలతో పోల్చుకుంటే రణబాలి బెటర్.  

రేటింగ్ 2 .5 /5                                                                                                 అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com