Home

»

Latest News

రిషబ్ శెట్టి vs రానా.. నిజమైతే మాత్రం వాళ్లకి పండగే

Jul 14, 2026 6:38PM

 


రిషబ్ శెట్టి(Rishab Shetty).. రానా(Rana daggubati)..నటనకి సంబంధించి తమ క్యారెక్టర్స్ లో పూర్తిగా లీనమయ్యి, అభిమానులు, ప్రేక్షకులని సమ్మోహనపరచగల ధీరులు. ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలే అందుకు ఉదాహరణ. 


2024 సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్   సృష్టించిన 'హనుమాన్’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడి క్యారక్టర్ లో  చేస్తుండటం  ఇప్పటికే సినిమాపై హైప్ పెంచగా, రానా దగ్గుబాటి ఒక పవర్‌ఫుల్ రోల్ లో చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వస్తున్నాయి. గతంలో బాహుబలి చిత్రంలో విలనిజానికి సరికొత్త నిర్వచనం చెప్పిన రానా, ఇందులో రిషబ్ శెట్టితో తలపడే ప్రధాన విలన్ లేదా కథను ఊహించని మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో  కనిపిస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

also read: హద్దు దాటొద్దు.. రెచ్చిపోయిన హీరోయిన్

విభిన్నమైన గెటప్పులలో కనిపిస్తాడని, కేవలం ఒకే రూపంలో కాకుండా కథా గమనంలో పలు వేరియేషన్స్ చూపిస్తుందని టాక్. కలియుగ నేపథ్యంలో హనుమంతుడు తన శ్రీరామునికి ఇచ్చిన మాటకు కట్టుబడి అజ్ఞాతవాసంలో ఉండే కథాంశంతో ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. భక్తి, శౌర్యం, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో రూపొందుతున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి మరియు రానా దగ్గుబాటి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పవర్‌ఫుల్ కాస్టింగ్ రూమర్స్ సోషల్ మీడియాను ఊపేస్తుండటంతో, దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 rishab shetty, rana daggubati, jaihanuman


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com