
స్టార్ స్టేటస్ తో పాటు అభిమానుల, ప్రేక్షకుల హృదయంలో సుస్థిర స్థానం అల్లాటప్పాగా రాదు. అందుకు ఎంతో పెట్టి పుట్టాలనేది ఎంత నిజమో, ఎంతో కృషి ఉండాలి. కానీ స్టార్ స్టేటస్ పొందాక కూడా టైం అనేది చూసుకోకుండా కష్టపడితే అసలైన సిసలైన కళామతల్లి ముద్దు బిడ్డ అనాల్సిందే. రమ్యకృష్ణ(Ramyakrishna)చెప్పిన మాటలతో ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ అవే మాటలు అంటున్నారు.
రమ్య కృష్ణ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా మ్యారేజ్ టైంలో 'సింహాద్రి'(Simhadri)షూటింగ్ జరుగుతోంది. రేపు ఉదయం నా పెళ్లి అనగా ముందు రోజు రాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్(Ntr)తో కలిసి ఆ పాట కోసం డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఆ పాట షూటింగ్ పూర్తి చేయాల్సిన డెడ్ లైన్ నా పెళ్లి ముహూర్తానికి చాలా దగ్గరగా ఉంది. దీంతో సాంగ్ కంప్లీట్ చేసి పెళ్ళికి వెళ్లానని చెప్పుకొచ్చింది. రమ్యకృష్ణ వివాహం జూన్ 12 2003 న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తో జరగగా, సింహాద్రి అదే సంవత్సరం జులై 9 న రిలీజై రికార్డులు సైతం బెదిరిపోయేలా సరికొత్త రికార్డుల సునామీని సృష్టించింది.
ఇక ఎన్టీఆర్, రమ్యకృష్ణ పై చిత్రీకరించిన చిన్నదమ్మే చీకులు కావాలా సాంగ్ లో ఎన్టీఆర్ , రమ్యకృష్ణ పోటాపోటీగా స్టెప్స్ చేసారు. సదరు స్టెప్స్ దెబ్బకి బాల్కనీ లో ఉన్న వాళ్లంతా స్క్రీన్ ముందుకు వచ్చి డాన్స్ చేయడమనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. రిపీట్ ఆడియెన్స్ కూడా వచ్చే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికీ ఏ ఫంక్షన్ జరిగినా 'చిన్నదమ్మే చీకులు' పాట మోగాల్సిందే. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం కూడా సాంగ్ ని చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి.
also read: Dacoit: ఓటీటీలోకి డెకాయిట్.. డేట్ ఇదేనా!
నటీనటులు తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంతో కష్టం, త్యాగం ఉంటుందని రమ్యకృష్ణ మాటలతో మరోసారి రుజువైంది. తన జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి రోజున కూడా వృత్తిని గౌరవించి, పని పూర్తి చేసిన ఆమె నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అందుకే ఆమె ఇప్పటికీ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పట్ల ఆమెకున్న గౌరవం, సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ ఈ సంఘటన ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి 'సింహాద్రి' సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తున్నాయి.






