.webp)
ఎంతో కాలంగా భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ భారీ చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మాత్రం భిన్నమైన స్పందన వస్తోంది.
ముఖ్యంగా సినిమా విజువల్స్, గ్రాఫిక్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్పై ప్రశంసలు కురుస్తుండగా.. కథనం, సంగీతం విషయంలో మాత్రం కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రామాయణం గురించి వస్తున్న పోస్టులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ సినిమాలో ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్నది మాత్రం యశ్ నటన. రావణుడి పాత్రలో ఆయన కనిపించిన తీరు, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయట. కొందరు నెటిజన్లు యశ్‌ను ఈ సినిమాకు అసలైన సీన్ స్టీలర్‌గా అభివర్ణిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు రాముడిగా రణ్‌బీర్ కపూర్ కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన నటనలోని ప్రశాంతత, పాత్రకు తగ్గట్టుగా చూపించిన హావభావాలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సీతగా సాయి పల్లవి కూడా తన పాత్రకు న్యాయం చేశారని టాక్ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మంచి మార్కులు సంపాదిస్తోంది. గ్రాండ్ సెట్స్, యుద్ధ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయని కొందరు ప్రశంసిస్తున్నారు. అయితే కొన్ని సన్నివేశాల్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయని, కొన్ని గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇక కథనం విషయంలోనే ఎక్కువగా మిశ్రమ స్పందన వస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఎమోషన్స్, డ్రామా కొంత తగ్గిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందించారు. ఇలాంటి ఇద్దరు దిగ్గజాలు పనిచేయడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా చూసిన కొందరు మాత్రం సంగీతం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఇతిహాస కథలో దైవత్వం, భావోద్వేగాలను సంగీతం మరింత బలంగా ఎలివేట్ చేయాల్సి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే ‘రామాయణం’లో గ్రాండియర్, విజువల్స్, యశ్ నటనకు మంచి స్పందన వస్తుండగా.. కథనం, ఎమోషన్స్, సంగీతం విషయంలో మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సోషల్ మీడియా టాక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రామాయణ భారీ అంచనాలను అందుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ‘రామాయణ’ రివ్యూ ఇచ్చిన దిల్ రాజు.!
[Ramayana Twitter Review, Ramayana Review Telugu, Ramayana Audience Response, Ramayana Movie Review, Ramayana Mixed Reviews, Ranbir Kapoor, Yash Ravana, Sai Pallavi, Nitesh Tiwari, Namit Malhotra]






