Home

»

Latest News

షాకింగ్ న్యూస్: రామాయణ పార్ట్ 1 ప్రీ పోన్!

Sep 29, 2026 4:35PM


భారతీయ  సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులందరు కళ్లల్లో వత్తులు వేసుకొని మరి రామాయణ కోసం చూస్తున్నారు. ప్రచారచిత్రాలతో రామాయణ ఎలా ఉండబోతోందనే ఆలోచన కూడా వాళ్ళ మస్తిష్కాల్లో ఉంది. ఈ విజువల్ వండర్ గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

నవంబర్ 8న దీపావళి కానుకగా రామాయణ విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓవర్ సీస్ మాత్రం 6 న విడుదల కానుంది. కానీ ఇప్పుడు  ఓవర్సీస్ అండ్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసేందుకు వీలుగా, మేకర్స్ నవంబర్ 5నే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే, అనుకున్న సమయం కంటే 3 రోజుల ముందే ఈ పౌరాణిక దృశ్యకావ్యం మన ముందుకు రాబోతుందని బాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇది కూడా చదవండి: మేడారం సమ్మక్క,సారలమ్మ దగ్గర నాని: సమర్పించిన మొక్కు వివరాలు ఇవే!

 


ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పండగ రోజు రిలీజ్ చేసే పూజలు, టపాసులు పనిలో ప్రేక్షకులు హడావిడిగా ఉంటారని మేకర్స్ బావిస్తున్నారంట.

 

[Ramayana Part 1 Preponed Release Date, ,Ramayana Part 1 , Yash Ravana Ramayana, Sai Pallavi Sita, Ramayana November 5 release, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com