'ఆర్ఆర్ఆర్' ఫ్లాపైతే ఇండస్ట్రీలో బట్టలిప్పి బ్రేక్ డాన్స్ చేస్తారు!
on Jun 6, 2020
"ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపై ఉంటుంది.. మేమంతా ఒకే కుటుంబంలా మెలుగుతాం.. ఒకళ్లనొకళ్లం ప్రేమిస్తాం అనేది పెద్ద బూతు" అన్నారు రామ్ గోపాల్ వర్మ. అంతే కాదు.. "ఒకవేళ రాజమౌళి నెక్ట్స్ సినిమా గానీ ఫ్లాపయ్యిందంటే ఇండస్ట్రీలో మొత్తం అందరూ బట్టలిప్పి రోడ్డు మీదకొచ్చి షాంపేన్ బాటిల్స్‌తో స్నానం చేస్తా, బ్రేక్ డాన్స్ చేస్తారు" అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇది లీకయిన ఆర్జీవీ ఆడియో కాల్లో ఉన్న విషయం. ఈ ఆడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.
'ఆర్ఆర్ఆర్' ఫ్లాపయితే ఇండస్ట్రీలోని వాళ్లు డాన్స్ ఎందుకు చేస్తారో ఆ ఆడియోలో ఆర్జీవీ చెప్పుకొచ్చారు. "కుళ్లుతో అంత సక్సెస్‌ని ఎవడూ తట్టుకోలేడు. కుళ్లు అనేది మానవ సహజం. ఒకరి ఎదుగుదల అనేది జీర్ణించుకోలేరు. రాజమౌళి అంత సక్సెస్ అయితే చచ్చిపోవడం మేలు అనేంత జెలసీ ఫీలవుతారు. అది యాక్చువల్ ట్రూత్" అని ఆయన అన్నారు.
ఇండస్ట్రీ అనేది ఒక ఇంటిది కాదనీ, అందులో వేర్వేరు వాళ్లుంటారనీ ఆర్జీవీ చెప్పారు. "ఇండస్ట్రీలో వేర్వేరు తరగతులుంటాయి. కెసాసిటీస్ వేరుంటాయి. స్టార్డమ్ లెవల్స్ వేరుంటాయి. డైరెక్టర్స్‌తో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకరు పది కోట్లు తీసుకోవచ్చు, ఒకరు ఒక కోటి తీసుకోవచ్చు. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు? ఇండస్ట్రీ అంతా ఒకటే అనేది ఒక స్టుపిడ్ లైన్" అని ఆయన కుండబద్దలు కొట్టారు.
తను ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే అనట్లేదని వర్మ అన్నారు. "ఒక పాలిటీషియన్ ఇంకో పాలిటీషియన్ ఎదుగుదలను తట్టుకోలేడు, ఒక బిజినెస్‌మ్యాన్ ఇంకో బిజినెస్‌మ్యాన్ ఎదుగుదలను తట్టుకోలేడు. కుళ్లు అనేది మానవ సహజం. అందుకని మేమంతా ఒక్కటే అనేది ఊసుపోక అనే మాట. అది ఎప్పటికీ జరగదు" అని తేల్చేశారు.