Home

»

Latest News

Ram Gopal Varma: ఆ ఇద్దరు పతనం కావాలి.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్  

Mar 20, 2026


-నిన్న థియేటర్స్ లోకి ధురంధర్ 2 
-పాజిటివ్ టాక్ 
-మరి రామ్ గోపాల్ వర్మకి వచ్చిన బాధ ఏంటి!

భారతీయ సినిమాకి సరికొత్త కథ, కథనాన్ని,టేకింగ్ ని నేర్పిన మూవీ 'ధురంధర్'(Dhurandhar). ఆ మూడు విభాగాల్లో ఎంతో మంది అగ్ర శ్రేణి దర్శకులు, అప్ కమింగ్ దర్శకులకి ఒక లెసన్ లాంటిది అనే అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు. దీంతో  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఆదిత్య దర్ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందటంతో పాటు పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేసే పరిస్థితిని కల్పించాడు. ఇక ప్రీమియర్స్ దగ్గర్నుంచే  ధురంధర్ 2(Dhurandhar 2) థియేటర్స్ కి అభిమానులతో పాటు సినీ మేకర్స్,ప్రతినిధులు భారీగా పోటెత్తారు. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో పార్ట్ 2 ఉందని ముక్త కంఠంతో వాళ్లంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 రిలీజ్ కి  కొన్ని రోజుల ముందు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఆ మాటలేంటో చూద్దాం.

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ధురంధర్ తో ఆదిత్య ధర్ సెట్ చేసిన కొత్త స్టాండర్డ్స్ వల్ల మిగతా దర్శకులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వస్తోంది. ఆదిత్య మార్క్ క్వాలిటీ కోసం సౌత్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్ని భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ ఆపేసి మరీ రీషూట్స్ జరుపుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అందుకే వారంతా ఆదిత్యపై కోపంగా ఉండటంతో పాటు అసూయతో ఉన్నారు. కొంత మంది అయితే  ఆదిత్య దర్ తో పాటు ఆయన భార్య యామి గౌతమ్ పతనం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి వాళ్లిద్దరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని వర్మ చెప్పుకొచ్చాడు. 

Also read: Dhurandhar 2: ధురంధర్ 2 తొలి రోజు కలెక్షన్స్ ఇవే.. పుష్ప2కి ఎసరు పెడుతుందా!

యామి గౌతమ్(Yami Gautam)తెలుగులో అల్లు శిరీష్ హీరోగా వచ్చిన గౌరవం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ధురంధర్ తో పాటు ధురంధర్ 2 కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో పాటు పార్ట్ 2 లో ఒక రోల్ లో కూడా కనిపించింది. ఆదిత్య ధర్ 2009 లో సినీ రంగ ప్రవేశం చేసి 2019 లో 'ఉరి ది సర్జికల్'స్ట్రైక్ ని తెరకెక్కించాడు. ధురంధర్ తన రెండవ సినిమా కాగా పార్ట్ 2 మూడవది.  రామ్ గోపాల్ వర్మ కూడా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి కొత్త కథ, కథనాన్ని, టేకింగ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com