
- రామ్ చరణ్ కోసం సుకుమార్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్
- మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న 'RC17' అప్‌డేట్
టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్(Sukumar) మళ్ళీ జతకడుతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. 'రంగస్థలం' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కోసం ఒక 'మైండ్ బ్లోయింగ్' ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం సుకుమార్ ఒకే కథను రెండు విభిన్న వెర్షన్లలో డెవలప్ చేశారని, అందులో బెస్ట్ వెర్షన్‌ను ఇప్పుడు ఫైనలైజ్ చేశారని సమాచారం. అంటే, కథ ఇప్పటికే లాక్ అయిపోయింది, ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. 'పెద్ది' తర్వాత చరణ్ కొంచెం గ్యాప్ తీసుకుని సుకుమార్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గతంలో 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్‌ను కొత్తగా చూపించిన సుకుమార్, ఈసారి అంతకు మించిన పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేశారట. చిట్టిబాబు పాత్ర తరహాలో చరణ్ నట విశ్వరూపం చూపిస్తే.. ఆయన ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చి చేరడం ఖాయమంటున్నారు.
ఈ సినిమాకు కూడా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాకు సంబంధించి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ లేదా పోస్టర్ వస్తుందేమోనని మెగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఒకవైపు 'పెద్ది' ప్రమోషన్స్, మరోవైపు సుక్కూ సినిమా అప్‌డేట్స్‌తో చరణ్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది డబుల్ ధమాకా ఖాయమనిపిస్తోంది.
'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, తన 17వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ పెర్ఫార్మెన్స్ తోడైతే మరో హిస్టరీ క్రియేట్ అవ్వడం ఖాయం.





