Home

»

Latest News

ఆ సిటీలో చరణ్: RC 17 కోసం కసరత్తుల కోసమేనా!  

Sep 24, 2026 5:50PM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయదశమికి వెల్ కమ్ చెప్తు సుకుమార్ తో చేయబోతున్న తన RC 17 ని స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అన్ని విధాలా సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే మరో సారి  కోయంబత్తూర్ లో ఉన్న ప్రసిద్ధ గంగా హాస్పిటల్‌లో కుడిచేతి మణికట్టు ట్రీట్ మెంట్ కి  సంబంధించిన సలహాలు గురించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది.  

  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    చరణ్ కొన్ని రోజుల క్రితం  గంగా హాస్పిటల్‌లో కుడిచేతి మణికట్టు (Right Wrist) శస్త్రచికిత్స చేయించుకోవడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 'పెద్ది' (Peddi) సినిమా చిత్రీకరణ సమయంలో చరణ్ కు తీవ్రమైన మణికట్టు గాయమైంది. కుస్తీ మరియు భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ప్రమాదవశాత్తు ఈ గాయం కాగా, షూటింగ్ షెడ్యూల్స్ పాడవకూడదనే ఉద్దేశంతో ఆయన నొప్పిని భరిస్తూనే షూటింగ్‌ను పూర్తి చేశారు. అయితే, భవిష్యత్తులో తీవ్ర కాంప్లికేషన్లు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు.


ఇది కూడా చదవండి: ప్రముఖ మలయాళ లెజండ్రీ నటీమణి మృతి.. వెలకట్టలేని పురస్కారాలు 

 

ఈ చికిత్స కోసం ఆర్థోపెడిక్స్ మరియు ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కోయంబత్తూర్ గంగా హాస్పిటల్‌ను ఎంచుకున్నారు. గంగా హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ S. రాజశేఖరన్ నేతృత్వంలో ఈ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ గాయం చాలా సంక్లిష్టమైనది కావడంతో మైయామీ (USA) నుంచి వచ్చిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బాడియాతో పాటు డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యాధునిక లాపరోస్కోపిక్ పద్ధతిలో ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో వైద్య బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.

 

 

[Ram Charan, RC 17, Ram Charan Wrist Surgery Ganga Hospital Coimbatore, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com