Home

»

Latest News

Ram charan: ఆ హీరో గెలుపు ఖాయమైన నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం!.. ఫ్యాన్స్ కి పూనకాలే 

May 05, 2026

 

పాన్ ఇండియా కట్ అవుట్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. పెద్దికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్న చరణ్ ఆ తదుపరి సుకుమార్(Sukumar)మూవీతో జాయిన్ కానున్నాడు. చరణ్ కెరీర్ లో పదిహేడవ చిత్రంగా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)  చరణ్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ తో నిర్మిస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


ఆర్ సి 17(Rc 17)ని  జులైలో సెట్స్ పైకి తీసుకెళ్లే సన్నాహాలు జరుగుతున్నాయని, సుకుమార్ ప్రెజెంట్ స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడని మైత్రి నిర్మాతల్లో ఒకరైన చెర్రీ అలియాస్ చిరంజీవి వెల్లడి చేసారు. దీంతో జూన్ 4 న రాబోతున్న పెద్ది తర్వాత చరణ్ ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా సుకుమార్ మూవీలో పాల్గొనబోతున్నట్లవుతుంది. గతంలో సుకుమార్, చరణ్, మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో  వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా చరణ్‌లోని అసలైన నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. చిట్టిబాబు క్యారక్టర్ లో చరణ్ ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సక్సెస్‌ఫుల్ కాంబో సిద్ధమవ్వడం విశేషం.

also read: విజయ్ గెలుపుపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. ఈ సమాజం కేవలం వాళ్లదే 

పెద్దితో చరణ్ విజయం సాధించడం పక్కా అనే వార్తలు వస్తున్నాయి.పైగా చరణ్ కనిపిస్తున్న డిఫరెంట్ గెటప్స్ కూడా ఫ్యాన్స్, ప్రేక్షకులని పిచ్చెక్కిస్తున్నాయి. ఈ  నేపథ్యంలో ఆర్ సి 17 లో సుకుమార్ ని చరణ్‌ ని ఒక రేంజ్ లోనే చూపించాలి. ఈ విషయం సుకుమార్ కి తెలియంది కాదు.పైగా పుష్ప 2 తో సుకుమార్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. పైగా సుకుమార్ సినిమాలంటేనే విభిన్నమైన క్యారెక్టరైజేషన్లు, రా అండ్ రస్టిక్ విజువల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్ సి 17 ని ఎలా ముస్తాబు చేస్తాడో తెలియంది కాదు. అందుకే ఫ్యాన్స్ రీగర్ గా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో నయా అప్ డేట్ వాళ్ళల్లో జోష్ తీసుకొస్తుంది. ఇక ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారా లేదా  అనేది చూడాలి. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com