Home

»

Latest News

Rakul preet singh: రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒకసారి మోసం చేస్తే క్షమించాలా!

May 22, 2026 10:35AM

 


ఆల్ అగ్ర హీరోలతో జత కట్టి  టాప్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేసిన భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet SIngh). ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో వివాహం జరిగిన తర్వాత కూడా తన కెరీర్‌ని  కొనసాగిస్తోంది.ఈ నెల 15 న  ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ, వామికా గబ్బిలతో కలిసి 'పతి పత్ని ఔర్ వో 2' తో థియేటర్స్ లో అడుగుపెట్టింది.  ప్రమోషన్లలో భాగంగా ఒక టాక్ షోలో రకుల్ తో పాటు మిగతా వాళ్ళు  కొన్ని ఆసక్తికరమైన విషయాలని  పంచుకున్నారు. ఈ చర్చ కాస్తా ఇంటర్నెట్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

 రకుల్‌ మాట్లాడుతు రిలేషన్‌షిప్‌లో మోసం చేయడం అనేది ఎట్టిపరిస్థితుల్లోను కరెక్ట్ కాదు. నేను  సమర్థించను, కానీ, అదే సమయంలో జీవితం చాలా పెద్దది. ఎవరైనా ఒకే ఒక్కసారి పొరపాటున ఆ తప్పు చేస్తే వన్ టైమ్ స్లిప్ కింద వారిని క్షమించవచ్చు అని చెప్పింది. సారా అలీ ఖాన్ మాత్రం రకుల్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేదు. ఒకవేళ భాగస్వామి తప్పు చేసి నిజాయితీగా క్షమాపణ చెబితే క్షమిస్తానేమో కానీ, ఆ మోసాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంది.వెంటనే ఆ మాటలపై రకుల్ స్పందిస్తూ, ఒకరిని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే. లేదంటే ఆ బంధం ముందుకు సాగదని చాలా మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చింది. అయితే, ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ బయటకు రాగానే నెటిజన్లు రకుల్ వ్యక్తిగత జీవితాన్ని, ఆమె భర్త జాకీ భగ్నానీని ఈ వ్యాఖ్యలతో ముడిపెడుతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు.

 

Also read: Jailer 2: జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!.. వాళ్ళు తప్పుకుంటే మంచిదేమో 

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ తమ పెళ్లిని సరదాగా 'సిట్యుయేషన్‌షిప్' అని పిలవడం, ఆ తర్వాత రకుల్ అతని చెవులు పట్టుకుని మరీ తాము మిలీనియల్స్ అని, జెన్-జీ లాగా మాట్లాడద్దని క్లారిటీ ఇచ్చిన వీడియో నెట్‌లో వైరల్  అయింది. ఈ నేపథ్యంలోనే రకుల్ చీటింగ్ గురించి మాట్లాడటంతో అందరూ రకరకాల అంచనాలకి  వచ్చేశారు. దాంతో రకుల్ వెంటనే అలర్ట్ అయ్యి, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరణ ఇస్తు ఒక గంట పాటు సాగిన సుదీర్ఘ ఇంటర్వ్యూ నుంచి కేవలం ఒకే ఒక్క లైన్‌ని  కట్ చేసి హెడ్‌లైన్‌గా మార్చడం చూసి నవ్వుకున్నాను. ఒక విషయాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను షోలో చేసిన వ్యాఖ్యలు సినిమా ప్రమోషన్లకి సంబంధించిన జనరల్ టాపిక్ మాత్రమే. నా వ్యక్తిగత వైవాహిక జీవితానికి, ఆ మాటలకి సంబంధం లేదు  జాకీ భగ్నానీ నా  మధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉందని రకుల్ తెలిపింది

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com