Home

»

Latest News

Rajinikanth vs dhanush: నువ్వా నేనా!

Jun 18, 2026 12:05PM

 


మాజీ మామ, అల్లుళ్లు కేటగిరిలో రజినీకాంత్(Rajinikanth),ధనుష్(dhanush)ఉన్నా కూడా ఇంకా అభిమానుల దృష్టిలో మామ, అల్లుళ్లుగానే ఉన్నారు. పైగా ఇప్పటికి ఇద్దరకీ ఒకరంటే ఒకరికి అభిమానమే. పైగా మాజీ అల్లుడు పోస్ట్ లో రజినీ సినిమాకి ఫ్యాన్ గా వెళ్లి థియేటర్ లో గత్తర కూడా లేపుతుంటాడు ధనుష్.  అందుకే ఈ ఇద్దర్ని మామ అల్లుళ్ళుగా ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్  'జైలర్ 2' షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకి చేరుకుంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు  ధనుష్ అప్ కమింగ్ మూవీ 'ధనుష్ 55' శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ హై-వోల్టేజ్ డ్రామాను కూడా దీపావళి టార్గెట్‌గానే థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇలా ఒకే సమయంలో మాజీ మామ, అల్లుడు పోటీ పడుతుండటంతో అటు అభిమానుల్లోనే కాకుండా ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.


Also read: Deewana: దీవాన మూవీ ఫస్ట్ రివ్యూ.. హర్షిత్ రెడ్డి లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!

ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఒకవైపు 'జైలర్ 2' చిత్రానికి ఉన్న భారీ బ్రాండ్ ఇమేజ్, నెల్సన్ డార్క్ కామెడీ యాక్షన్ స్టైల్ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచుతుండగా, మరోవైపు ధనుష్ కంటెంట్ ఓరియెంటెడ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, రాజ్ కుమార్ పెరియసామి మేకింగ్ స్టైల్ గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో రజనీకాంత్, ధనుష్ కలిసి ఎన్నో పండుగలను ఒకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన తర్వాత వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.  


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com