Home

»

Latest News

Chiranjeevi: చిరంజీవిపై సమంత భర్త వ్యాఖ్యలు వైరల్.. ఆ విధంగా జరిగి ఉంటే ఎలా ఉండేదో!

Jun 17, 2026 10:30AM

 

చిరంజీవి(chiranjeevi).. నాలుగు దశాబ్డల నుంచి ఈ పేరుకి ఉన్న చరిష్మా ఏ పాటిదో తెలిసిందే. నేటికీ ఎంతో మంది నటులకి, దర్శకులకి చిరంజీవితో మూవీ చేయాలనీ ఉంటుంది. బాలీవుడ్ లో తెరకెక్కే పలు చిత్రాలకి కూడా చిరంజీవిని ఆప్షన్ గా ఎంచుకునే వారు ఎంతో మంది. భారతీయ ఓటీటీ రంగాన్ని ఒక ఊపు ఊపిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.  శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ కీ రోల్ పోషించగా దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులని సంపాదించుకుంది. 2019 సెప్టెంబర్ 20న మొదటి సీజన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టిన ఈ సిరీస్, ఇప్పటివరకు 3 విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుంది. 2025లో విడుదలైన మూడో సీజన్ కేవలం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 35 కంటే ఎక్కువ దేశాల్లో టాప్ 5 ట్రెండింగ్‌లో నిలిచి ప్రైమ్ వీడియోలోనే మోస్ట్ వాచ్డ్ సిరీస్‌గా రికార్డు సృష్టించింది.  

ప్రముఖ దర్శకుల ద్వయం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) ఈ కథని  రాసుకున్నప్పుడు, వారి మనసులో ఉన్న మొదటి ఛాయిస్ మనోజ్ బాజ్‌పాయ్ కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. ప్రముఖ ఇంటర్వ్యూయర్ ఐడిల్ బ్రెయిన్ జీవితో మాట్లాడిన సందర్భంగా రాజ్ నిడిమోరు(Raj nidimoru)ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. అయన  మాట్లాడుతూ 'ఫ్యామిలీ మ్యాన్' కథని మొదట ఒక వెబ్ సిరీస్‌లా కాకుండా, చిరంజీవి హీరోగా ఒక భారీ తెలుగు కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేసాం. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిలా కనిపిస్తూ, దేశాన్ని కాపాడే సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా ఉండే ఆ పవర్‌ఫుల్ క్యారక్టర్ కి  చిరంజీవి అయితేనే నూటికి నూరు శాతం న్యాయం చేయగలరని భావించాం.

కానీ ఆ సమయంలో సినిమా మార్కెట్ పరిస్థితులు, స్క్రిప్ట్ డిమాండ్స్ , వివిధ రకాల ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కాలక్రమేణా  సినిమా కథ వెబ్ సిరీస్‌గా మారిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  అభిమానిలు స్పందిస్తూ 'ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక మెగాస్టార్‌తో సినిమాగా వచ్చి ఉంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో మరియు భారతీయ సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ అయ్యేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 40 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్స్  పోషించిన చిరంజీవి,  మిలిటరీ ఇంటెలిజెన్స్ డ్రామా ఫ్యామిలీ మెన్  లో చేసి  ఉంటే ఆ హైప్ వేరే రేంజ్‌లో ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాజ్ అండ్ డీకే తాము రూపొందించే బాలీవుడ్ కంటెంట్‌లో కూడా ఎక్కడో ఒకచోట సౌత్ ఇండియన్ ఎలిమెంట్స్, ముఖ్యంగా చిరంజీవి రిఫరెన్స్‌లను వాడుతూనే ఉంటారు. 2013లో వారు తీసిన జంబీ కామెడీ చిత్రం 'గో గోవా గాన్'లో చిరంజీవి ఐకానిక్ 'గొలిమార్' సాంగ్ రిఫరెన్స్‌ని  ఉపయోగించారు. గన్స్ అండ్ గులాబ్స్ లో కూడా చిరంజీవి సినిమాకి సంబంధించిన రిఫరెన్స్ ఉపయోగించారు.  అంతలా మెగాస్టార్ ప్రభావం వారిపై ఉంది. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్స్ సీజన్ 4 స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. చిరంజీవి హిందీలో ప్రతిబంద్, ఆజ్ కా గూండారాజ్ చిత్రాల్లో చేసిన విషయం తెలిసిందే.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com