
రాఘవ లారెన్స్.. ఈ పేరుకి సౌత్ సినీ ప్రేమికులకి మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడుగా, నటుడుగా అనేక మంది అభిమానులని సంపాదించుకున్నాడు. సామిజిక సేవ పరంగా కూడా ముందు ఉంటూ ఎంతో మంది పేద వాళ్ళని ఆదుకుంటూ వస్తున్నాడు.
త్వరలోనే లారెన్స్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని, దళపతి విజయ్ పిలుపు మేరకు టీవీకే పార్టీలో చేరబోతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టీవీకే పార్టీ ఆశయాలైన అవినీతి రహిత పాలన, పారదర్శకతకి లారెన్స్ సేవా దృక్పథం సరిగ్గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికల్లో టీవీకే తరఫున లారెన్స్ బరిలోకి దిగే అవకాశం ఉందని టాక్ . ఈ నియోజకవర్గం నుంచి గతంలో విజయ్ పోటీ చేసి భారీ మెజారిటీ సాధించడంతో, ఇప్పుడు ఆ స్థానాన్ని తన నమ్మకస్థుడైన మిత్రుడు లారెన్స్ కి అప్పగించాలని విజయ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read: యూట్యూబర్ నందు ఫ్యామిలీకి షాక్.. ఎవరు ఊహించని నోటీసులు జారీ
ఈ పరిణామాలు తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికాయి. విజయ్ కి 100 శాతానికి పైగా సినీ తారలు మరియు అభిమానుల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ వంటి దిగ్గజాలు విజయ్ ని అభినందించారు. ఇప్పుడు లారెన్స్ వంటి ప్రజాదరణ ఉన్న నటుడు పార్టీలోకి వస్తే టీవీకే బలం మరింత రెట్టింపు అవుతుందని క్యాడర్ ఉత్సాహంగా ఉంది. సినిమా గ్లామర్ తో పాటు సామాజిక సేవా గుర్తింపు ఉన్న లారెన్స్ ఎంట్రీ ఇస్తే తిరుచ్చి ఉపఎన్నిక వన్ సైడ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.






