
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నా(Raashii Khanna)ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 'పుష్ప'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ సరసన నటించే అవకాశం రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే, రాశి ఖన్నా కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది.
లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కూడా చాలా బలంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ గురించి చర్చలు జరిగినప్పటికీ, ఇప్పుడు అది పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
రాశి ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా ఆమె ఖాతాలో చేరితే, మెగా ఆఫర్ కొట్టేసినట్టే.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
Also Read: కాస్టింగ్ కౌచ్‌పై మెగా కోడల సంచలన వ్యాఖ్యలు






