Home

»

Latest News

Gaddar awards: గద్దర్ అవార్డ్స్ పై ఆర్ నారాయణమూర్తి కామెంట్స్.. ఆ వ్యాఖ్యలు సరైనవేనా! 

Mar 10, 2026

 

 

-నిన్న ఈటీవీ విన్ పాత్రికేయ సమావేశం 
-పలువురు సినీ ప్రముఖులు హాజరు 
-నారాయణ మూర్తి ఏం మాట్లాడాడు 

కోట్ల రూపాయల డబ్బు ఇచ్చినా కమర్షియల్ సినిమాల్లో చేయను. ప్రజలని చైతన్య పరిచే, ఉద్వేగ పరిచే సామాజిక ఎజెండానే నా సినీ అజెండా అని నిరూపించారు ఆర్ నారాయణ మూర్తి(R Narayanamurthy). ఆ బాటలోనే సినిమాలు చేస్తూ అభిమానుల దృష్టిలో వీడు మగాడ్రా బుజ్జి అనిపించుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసిన గద్దర్ అవార్డ్స్(Gaddar Awards)లో   ఈటీవీ విన్ రికార్డు స్థాయిలో నాలుగు అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈటీవీ విన్(Etv Win)పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కారక్రమానికి ఆర్ నాయణమూర్తి ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ ఆకట్టుకునే స్థాయిలో సాగింది.  ఏం మాట్లాడారో చూద్దాం.

ఆయన మాట్లాడుతు సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. అది సామాజిక సమస్యలకి అద్దం పట్టే ఒక సాధనం అని నమ్మే గొప్ప వ్యక్తి రామోజీరావు(Ramjorao)గారు. ఆయన ఆశయాలకి అనుగుణంగా, నేడు ఈటీవీ విన్ సరికొత్త ప్రతిభని వెలికితీస్తు మట్టిలో మాణిక్యాలని వెలికితీసే ఒక గొప్ప వేదికగా మారింది. ముఖ్యంగా "మట్టి మనిషి"గా పేరు తెచ్చుకున్న రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్  సాయిలు(Sailu)మట్టి వాసనతో కూడిన సినిమాలు తీయడం అభినందనీయం. గద్దర్ అన్న ఒక ప్రపంచ స్థాయి కమ్యూనికేటర్. అలాంటి గద్దర్(Gaddar)అన్న పేరుపై తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గద్దర్ అన్న కేవలం ఒక ప్రజా కవి మాత్రమే కాదు, ఆయన ఒక లెజెండ్. అస్సాంలో భూపేన్ హజారికాకు ఎంతటి గౌరవం లభిస్తుందో, తెలంగాణలో గద్దర్ అన్నకు కూడా అంతటి గౌరవం లభించడం గర్వకారణం.

also read: Lavanya tripathi: పోలీసులని ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి.. అసలు ఆట మొదలైంది

 ఎన్టీఆర్(Ntr),ఏఎన్ఆర్(Anr)వంటి మహానటులు సినిమా రంగంలో ఎంతటి ప్రభావం చూపారో, ప్రజా కళారంగంలో గద్దర్ అన్న అంతటి ప్రభావాన్ని చూపారు. గత 13 ఏళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డులని  పునరుద్ధరించి, రికార్డు స్థాయిలో కేవలం 45 రోజుల్లోనే ప్రక్రియని పూర్తి చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy)గారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎటువంటి పైరవీలు లేకుండా, కేవలం ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చి అవార్డులు ప్రకటించిన జూరీ సభ్యుల పనితీరుకి  హాట్స్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు కూడా స్పందించి, అక్కడ కూడా నిలిచిపోయిన నంది అవార్డులను మళ్ళీ ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పాలని కూడా నారాయణమూర్తి  ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com