Home

»

Latest News

గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకి రారు.. ఆ హీరో గురించేనా!

May 30, 2026 2:30PM

 


30 ఇయర్స్ పృథ్వీ(Prudhvi Raj)కి నిజంగానే ఇండస్ట్రీలో  థర్టీ ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. పొలిటికల్ గాను కాక పుట్టే వ్యాఖ్యలు చేయడం పృథ్వీ స్పెషల్. సినీ కెరీర్ పరంగా చూసుకుంటే ఆయన అప్ కమింగ్ మూవీ రిస్క్. రీసెంట్ గా రిస్క్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. 

 ఈ ఈవెంట్ కి హాజరైన పృథ్వీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్న సినిమాల నుండి భారీ పాన్ ఇండియా చిత్రాల వరకు ప్రతి ఒక్కరూ కాలేజీ ఈవెంట్లని  నమ్ముకుని ప్రమోషన్లు చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ కాలేజీ వేడుకలు కేవలం కేరింతలు, కేకలకే పరిమితం అవుతున్నాయి. వీటి వల్ల థియేటర్లకి  ప్రేక్షకులని  రప్పించడం సాధ్యం కావడం లేదు. ఆ తరహా ప్రమోషన్ల వల్ల కలెక్షన్లకి పైసా ఉపయోగం ఉండటం లేదు. ప్రస్తుతం ఒక సినిమా బడ్జెట్‌లో దాదాపు 15 నుండి 20 శాతం వరకు కేవలం ప్రమోషన్ల కోసమే కేటాయిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలేజీ క్యాంపస్‌లలో నిర్వహించే ఆర్భాటపు వేడుకలు సోషల్ మీడియాలో కాసేపు హల్ చల్ చేయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం, కాలేజీ ఈవెంట్లకి  హాజరయ్యే విద్యార్థులలో కేవలం 5 శాతం మంది మాత్రమే నిజంగా థియేటర్లకి  వెళ్లి సినిమా చూస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది కేవలం సెలబ్రిటీలని  చూడటానికే వస్తున్నారని డేటా చెబుతోంది. కాబట్టి  కంటెంట్‌ బాగుంటేనే ప్రేక్షకులు సినిమాని  ఆదరిస్తారు.

Also read: Amitabh bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ ట్వీట్ 


గతంలో సినిమా ప్రమోషన్లు చాలా సహజంగా, ప్రజల్లోకి వెళ్లేలా ఉండేవి. కానీ నేడు డిజిటల్ వ్యూస్, యూట్యూబ్ ట్రెండింగ్, కాలేజీ ఈవెంట్ల చుట్టూనే ప్రమోషన్ల హడావుడి నడుస్తోంది. సినిమా బాగుంటే పబ్లిసిటీ లేకపోయినా 100 శాతం సక్సెస్ అవుతుందని, థియేటర్లలో సీట్లు నిండుతాయని ఆయన ఉదాహరణలతో వివరించారు. పృథ్వీ  రాజ్ తన మాటలతో  కాలేజీ ఈవెంట్లలో కనిపించే ఆ కాసేపటి క్రేజ్ చూసి సినిమా సూపర్ హిట్ అయిపోతుందని భ్రమపడొద్దని  గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయిందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com