Home

»

Latest News

'వారణాసి'పై ప్రియాంక చోప్రా కీలక వ్యాఖ్యలు.. ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉండి ఉంటే

Sep 16, 2026 4:51PM

 

 

ప్రియాంక చోప్రా.. ప్రపంచ సినిమా భారతీయ సినిమా గుమ్మం తొక్కేలా చేసిన నటి. అందుకు సజీవ సాక్ష్యం ఆమె చేసిన ఇంగ్లీష్ సినిమాలు. ఇప్పుడు  రాజమౌళి, మహేష్ బాబు ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసిలో చేస్తుంది. దీన్ని బట్టి ప్రపంచ సినీ ప్రేమికుల మైండ్ లో వారణాసి కొలువుతీరి ఉంటుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. 

 
ప్రియాంక చోప్రా రీసెంట్ గా ఒక స్పెషల్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ వేడుకల్లో రాజమౌళిని తొలిసారిగా కలిశాను. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం జరిగిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత రాజమౌళి నుంచి నాకు  కాల్ వచ్చింది. ఫోన్ సంభాషణలో రాజమౌళి 'వారణాసి' కథలోని మందాకిని పాత్ర గురించి వివరిస్తూ.. "ఈ కథానాయిక పాత్ర కోసం నేను మిమ్మల్నే  ఊహించుకున్నానని   అన్నారు. ఆ ఒక్క మాట నా మనసుని  ఎంతగానో తాకింది. మరో ఆలోచన లేకుండా వెంటనే  ఒప్పుకున్నాను.  తెలుగు భాష సరిగ్గా రాకపోవడంతో ఆరంభంలో నటన విషయంలో కొంత ఇబ్బంది పడ్డాను,అదో పెద్ద సవాలుగా అనిపించిందని ఆమె ఓపెన్ అయ్యారు. అయితే, సెట్స్‌లో రాజమౌళి తనపై చూపించిన నమ్మకం, ప్రతి సీన్ పరిపూర్ణంగా వచ్చేలా  అందించిన మార్గదర్శకత్వం ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. గ్లోబల్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమవ్వడం తన సినీ ప్రయాణంలో ఓ మరచిపోలేని అనుభూతిని ఇస్తోందని ప్రియాంక చోప్రా ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది.

 

 

Also Read: ధురంధర్ రికార్డ్స్ ని పక్కకు నెట్టిన హనుమాన్ అంశ్: ట్రేడ్ సర్కిల్స్ షాక్   

అత్యంత క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాను సమానంగా పండించగలిగే సత్తా ప్రియాంకలో ఉందని భావించే జక్కన్న ప్రియాంకని ఎంపిక చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్  ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ అనే విషయం తెలిసిందే. 

 

 

 

[Priyanka Chopra, Varanasi, ss Rajamouli, Mandakini Role Priyanka, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com