Home

»

Latest News

'ఇరుముడి' హీరోయిన్ ఒకప్పుడు యాంకర్ అనే విషయం తెలుసా.?

Aug 25, 2026 5:14PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన 'ఇరుముడి' బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు కూడా మంచి పేరు వచ్చింది. అయితే హీరోయిన్ గా మారకముందు, ఒకప్పుడు ఆమె టీవీ యాంకర్ అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.

ఒక తమిళ న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించి, సీరియల్ నటిగా ఎదిగి, ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్నారు ప్రియా భవానీ శంకర్. తాను యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన విషయాన్ని 'ఇరుముడి' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా ఆమెనే రివీల్ చేయడం విశేషం.

ప్రముఖ తమిళ న్యూస్ ఛానెల్ 'పుదియ తలైమురై'లో న్యూస్ ప్రెజెంటర్‌గా ప్రియ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు హోస్ట్‌గా మారి తన మార్కు చూపించారు. అక్కడి నుంచి 'కళ్యాణం ముదల్ కాదల్ వరై' అనే పాపులర్ సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టారు.

టీవీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2017లో వచ్చిన 'మేయాద మాన్' చిత్రంతో తమిళ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ప్రియ. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కార్తీ సరసన 'కడైకుట్టి సింగం', ఎస్.జె. సూర్య కాంబినేషన్‌లో 'మాన్‌స్టర్', ధనుష్ కాంబినేషన్‌లో 'తిరుచిత్రంబలం' వంటి చిత్రాల్లో నటించారు. 

తెలుగులో 'కళ్యాణం కమనీయం' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియ.. భీమా, జీబ్రా వంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఇరుముడితో మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగే అవకాశముంది. 

 

 

 

Ravi Teja, Irumudi, Priya Bhavani Shankar, Interview

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com