Home

»

Latest News

Prithviraj Sukumaran: గ్యాంగ్ స్టర్ అమిర్ అలీ ఎవరు.. పృథ్వీరాజ్ సుకుమారన్ సరైన సమాధానం చెప్తాడా

Apr 24, 2026

 

సెల్యులాయిడ్ పై పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)చేసే మెస్మరైజ్ ని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత చాలా బలంగానే ఉంది. అందుకు తగ్గట్టే ఆయన కూడా సెల్యులాయిడ్ ని గౌరవిస్తూ  హీరోగానే కాకుండా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ కోవలోనే సలార్ లో వరదరాజ్ మన్నార్ గా  మెప్పించగా ప్రస్తుతం మహేష్, రాజమౌళిల వారణాసిలో 'కుంభ' గా చేస్తున్నాడు. రీసెంట్ గా పృథ్వీ రాజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి ఫ్యాన్స్ లో జోష్ తెప్పిస్తుంది.  

'ఖలీఫా'(khalifa)..పృథ్వీరాజ్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. 'అమీర్ అలీ' అనే పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపిస్తున్నాడు. ప్రతీకారం బంగారంతో రాయబడుతుందనే టాగ్ లైన్ అయితే మూవీపై అంచనాలని పెంచుతుంది. దుబాయ్ మరియు కేరళ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా. రీసెంట్ గా ఖలీఫా టీం రిలీజ్ డేట్ ని ప్రకటించింది. ఆగస్టు 20, 2026న 'ఓనమ్' పండుగ కానుకగా థియేటర్స్ లో అడుగుపెడుతుంది.  

Also read: Sreeleela: శ్రీలీల ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన దర్శకుడు.. ఎందుకిలా చేస్తున్నారు

పృథ్వీరాజ్ ఈ మూవీలో రిచ్ మరియు డామినేటింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన లుక్ ఈ విషయాన్నీ చాలా స్పష్టంగా చెప్తుంది. వైశాఖ్(Vysakh)దర్శకత్వం వహిస్తుండగా  గతంలో పృథ్వీరాజ్‌తో 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' నేపథ్యంలో 'మల్లూ సింగ్' వంటి సినిమాలు చేసిన అనుభవం ఈయనకు ఉంది. ఇక ఈ చిత్రానికి ఉన్న అతి పెద్ద స్పెషల్  సూపర్ స్టార్  మోహన్ లాల్ గారు గెస్ట్ రోల్ లో కనిపించడం. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, జిను వి. అబ్రహం కథని  అందించారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com