Home

»

Latest News

ఓటీటీలో ‘బ్లాస్ట్’ అవుతున్న క్రేజ్.. ప్రీతి ముకుందన్ మైండ్ బ్లోయింగ్ యాక్షన్!

Jun 29, 2026 3:53PM

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొందరు మొదటి సినిమాతోనే స్టార్స్ అయిపోతే.. మరికొందరు మాత్రం సరైన టైమ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) రెండో కోవకే చెందుతుంది.

తమిళంలో వచ్చిన “ఆసాకూడా” అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌తో ఈమె రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ అయిపోయింది. ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, సింపుల్ స్టెప్స్‌కి కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్ చూసి టాలీవుడ్ మేకర్స్ కూడా ఈమెను వెంటనే లైన్‌లో పెట్టారు. 

శ్రీవిష్ణు సరసన 'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ సినిమా ఈమె కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. ఆ తర్వాత మంచు విష్ణు పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో 'నెమలి' అనే క్యారెక్టర్‌లో కనిపించి గ్లామర్, ట్రెడిషనల్ లుక్‌తో మెప్పించినా.. ఆమెలోని అసలైన నటనను చూపించే స్కోప్ రాలేదు. 

ఎంతో టాలెంట్ ఉండి కూడా సరైన బ్రేక్ కోసం ఈ బ్యూటీ ఎంతగానో వెయిట్ చేసింది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే కోలీవుడ్‌లో ఈమె చేసిన 'బ్లాస్ట్' (Blast) అనే సినిమా రిలీజ్ అయింది. సుభాష్ కె. రాజ్ డైరెక్షన్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, అభిరామి లాంటి సీనియర్ యాక్టర్స్‌తో కలిసి ప్రీతి ఒక మెయిన్ రోల్ ప్లే చేసింది. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి సూపర్ హిట్ అయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక అసలైన 'బ్లాస్ట్' అంటే ఏంటో చూపిస్తోంది.

ఈ సినిమాలో ప్రీతి ప్లే చేసిన 'నీల' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. అన్యాయాన్ని ఎదిరించే ఒక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి తన కుటుంబంతో కలిసి.. కార్పోరేట్ మాఫియా గ్యాంగ్ నుండి తన ఊరిని ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ. 

సీనియర్స్ ఎంతమంది ఉన్నా.. ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ మాత్రం ప్రీతినే. ఎక్కడా మేకప్ హడావుడి లేకుండా, చాలా సహజంగా కనిపిస్తూనే.. ఆమె చేసిన హై-వోల్టేజ్ రియలిస్టిక్ ఫైట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ అంతా ఇప్పుడు ఓటీటీలో చూసి.. "బాబోయ్.. ఇంతటి అద్భుతమైన నటిని ఇప్పటివరకు ఎలా మిస్ అయ్యాం!" అంటూ సోషల్ మీడియాలో ఆమె యాక్షన్ క్లిప్స్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

ఈ రేంజ్ పాపులారిటీ వచ్చాక టాలీవుడ్ ఊరుకుంటుందా? మన తెలుగు మేకర్స్ ప్రీతి ముకుందన్‌కు బ్యాక్-టు-బ్యాక్ క్రేజీ ఆఫర్స్ ఇస్తూ టాలీవుడ్ లో జాక్‌పాట్ తగిలేలా చేశారు. ప్రస్తుతం తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ ఈమె చేతిలో ఉన్నాయి.

'హిట్' ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్‌లో, యంగ్ హీరో రోషన్ సరసన ప్రీతి హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు.. హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీలో కూడా ఈమెనే హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. వరుసగా ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్‌గా సెటిల్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com