Home

»

Latest News

Prakash Raj: శ్రీరాముడు వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్షన్.. ఇలాగే వాగుతుంటారా?

Apr 19, 2026

కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో రామాయణ పాత్రలను ఉద్దేశించి ముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాముడిని "ఉత్తరాది వలసదారుడు" అని, రావణుడిని "గిరిజన నాయకుడు" అని అభివర్ణించడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రకాష్ రాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆయనపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చారు. ఓ వైపు తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరిస్తూనే, మరోవైపు విమర్శకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

నా ఉద్దేశ్యం అది కాదు!
ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని, అందరినీ సమానంగా చూసే నాకు ఆ అవసరంలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. తనపై వస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. "ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారు" అని ఆయన ధ్వజమెత్తారు. మతన్మోదాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నవారు.. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. నాపై హిందూ ద్వేషి అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, పూర్తి ప్రసంగాన్ని వినకుండానే కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలతో పాటు ఇతర పనులతో బిజీగా ఉన్నాను. త్వరలోనే అందరికీ సమాధానం చెబుతాను. అప్పటివరకు మీ పని మీరు చేసుకుంటారో లేక ఇలాగే వాగుతుంటారో మీ ఇష్టం." అని ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

మరి ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఈ వివరణతో వివాదం సద్దుమణుగుతుందా లేక మరిన్ని విమర్శలకు దారితీస్తుందా అనేది చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com