Home

»

Latest News

Prakash raj: ఈ నటుడుకి కులం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్ 

Jul 7, 2026 2:30PM

 

ప్రకాష్ రాజ్.. నటుడుగా పది కాలాల పాటు పదితరాల వారు చెప్పుకునేంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సమాజంలో కులం, మతం అనే అంశాలపై ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో గళం విప్పుతూనే ఉంటాడు. అయితే, ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక తీవ్ర శోకం నేపథ్యంలో ఆయన పంచుకున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ మాతృమూర్తి స్వర్ణలత గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత ప్రయాణం, తమ కుటుంబ నేపథ్యం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతు 'సమాజంలో ఎవరైనా తనని  పరిచయం అడిగితే, నేను  ఏ కులానికో లేక మతానికో చెందినవాడినని చెప్పనని, అందరికంటే ముందుగా నేను ఒక 'మనిషిని' అని గర్వంగా చెప్పుకుంటాను. నటన అనేది కేవలం తన వృత్తి మాత్రమే. చదవడం, రాయడం నాకున్న ముఖ్యమైన అభిరుచులు. నా  తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకి వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించగా, ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యాడు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మని ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.


Also read: ఆ మూవీని ప్రమోట్ చేస్తే పెద్దిని డామేజ్ చేస్తున్నావ్ అనేవారు.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com