పవర్ లిఫ్టింగ్ లో భారత్ కి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని తెచ్చిన నటి ప్రగతి
on Dec 7, 2025

తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రగతి. ఈమెలో నటన మాత్రమే కాదు బరువులు ఎత్తే కళ కూడా ఉంది. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి దుమ్ము రేపుతున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకున్నారు.
టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాష్టర్స్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్ షిప్ లో ఆమె భారత్ ని రిప్రెజెంట్ చేశారు. అలాగే నాలుగు పథకాలను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఓవర్ ఆల్ గా సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్, బెంచ్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో రెండు సిల్వర్ మెడల్స్ ని సాధించారు.
ఇక సెలబ్రిటీస్ ఆమెను అభినందిస్తున్నారు. సింగర్స్ శ్రావణ భార్గవి, శ్రీరామచంద్ర, యాంకర్స్ స్రవంతి, అష్షు రెడ్డి, అరవింద్ కృష్ణా, జ్యోతక్క, మధుశాలిని, యాంకర్ ఝాన్సీ, నిఖిల్ విజయేంద్ర సింహ, నేహా చౌదరి, తేజస్విని గౌడ, రెజీనా కసాండ్ర వంటి వాళ్లంతా అభినందనలు చెప్తున్నారు.
ప్రగతి ఎప్పుడూ జిమ్ లో ఫిట్నెస్ లో రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆమె 2023 నుంచి పవర్ లిఫ్టింగ్ లో ఎంట్రీ ఇచ్చి ఆమె రెండేళ్లలోనే ఎన్నో మెడల్స్ ని కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్, తెలంగాణ స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. తెనాలిలో జరిగిన నేషనల్ లెవెల్ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచారు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ అలాగే కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.
ఇక 2024 లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బ్రోన్జ్ మెడల్ ని సాధించగా ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఒక గోల్డ్ మూడు సిల్వర్ మెడల్స్ ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, ఇండస్ట్రీ ప్రతిష్టను మరింత పెంచారు ప్రగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



