బాబు ప్రదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ తెలుసుగా
on Oct 17, 2024
సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల షోస్ కి యాంకర్‌గా చేస్తు తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju)పలు సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో సోలో హీరోగా అరంగ్రేటం చేసాడు.2021 జనవరిలో విడుదల అయిన ఆ మూవీలో రీసెంట్ గా హనుమాన్(hanuman)లో తేజ సజ్జ తో జోడి కట్టి భారీ విజయాన్ని అందుకున్న అమృత అయ్యర్ హీరోయిన్ గా చేసింది.ప్రదీప్, అమృత మీద చిత్రీకరించిన లవ్ సాంగ్ అయితే ఇప్పటికి చాలా మంది ఫోన్స్ కి రింగ్ టోన్ గా కూడా ఉంది.
చాలా కాలం తర్వాత ప్రదీప్ సోలో హీరోగా మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కాకపోతే ఇప్పుడు ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్(pawan kalyan) ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(akkada ammayi ikkada abbayi)టైటిల్ తోనే ఈ సినిమా రాబోతుంది. అంటే పవన్ టైటిల్ తో ప్రదీప్ వస్తున్నాడు.ఈ మేరకు రీసెంట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేయడం జరిగింది.దీంతో పవన్ ఫ్యాన్స్ ప్రదీప్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి పవన్ రేంజ్ ని నిలబెట్టే బాధ్యత కూడా ప్రదీప్ మీద ఉంది.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ లేడీ యాంకర్ దీపిక పిల్లి(dipika pilli)హీరోయిన్గా చేస్తుంది.నితిన్ భరత్(nitin bharath)లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా మాంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తుంది. రధన్ సంగీత దర్శకుడు కాగా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రానుంది.
Also Read