
ప్రభాస్ అభిమానులకు ఈ ఏడాది బర్త్‌డే మరింత స్పెషల్‌గా మారబోతుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 3 నిమిషాల ‘ఫౌజీ’ టీజర్ వచ్చే అవకాశం ఉందనే టాక్ మొదలైంది. దీనికి తోడు ప్రభాస్ నటిస్తున్న మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల నుంచి కూడా అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను ఇంతకుముందెన్నడూ చూడని లుక్‌లో చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి మూడు నిమిషాల నిడివితో టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ వీడియోలో ‘ఫౌజీ’ వరల్డ్‌ను పరిచయం చేయడంతో పాటు ప్రభాస్ పాత్రకు సంబంధించిన కీలక అంశాలను చూపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో.. బర్త్‌డే టీజర్ ఎలా ఉంటుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ బర్త్‌డేకు ‘ఫౌజీ’ టీజర్ తో పాటు స్పిరిట్, కల్కి-2 అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్పిరిట్’లో ప్రభాస్ మొదటిసారి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ఏదైనా కాన్సెప్ట్ పోస్టర్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ‘కల్కి 2’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కల్కి 2’ నుంచి కూడా.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రత్యేక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మొత్తానికి.. ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్, ‘స్పిరిట్’ నుంచి అప్‌డేట్, ‘కల్కి 2’ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఇలా మూడు ట్రీట్స్ ఒకే రోజు వస్తే ప్రభాస్ అభిమానులకు నిజంగానే పండగే.
ఇది కూడా చదవండి: ‘మండాడి’ ఊహించని రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.!
[Triple Treat For Prabhas Fans, Prabhas Birthday Surprise, Rebel Star Prabhas, Hanu Raghavapudi, Fauzi Teaser, Spirit Movie, Kalki 2 Movie, Fauzi Movie, Telugu Film News]




