Home

»

Latest News

త్రివిక్రమ్‌పై ప్రముఖ హీరోయిన్ సంచలన ఆరోపణలు.. కుటుంబ బలహీనతని వాడుకొని...!

Oct 10, 2026 2:22PM


పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులు ఎనీ టైం గుర్తుపట్టే భామ. సోషల్ మీడియాలో చేసే సంచలన  పోస్ట్ లతో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న పూనమ్ రీసెంట్ గా దర్శకుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ వైరల్ హోదాలో చక్కర్లు కొడుతూ ఉంది.   


త్రివిక్రమ్ తన కుటుంబంలోని బలహీనతలను ఆసరాగా చేసుకుని, బలవంతంగా స్టేట్‌మెంట్లు ఇప్పించారు. వ్యక్తిగత సమస్యలు తలెత్తినప్పుడు కావాలనే దూరం పెట్టి, తిరిగి తమ అవసరం వచ్చినప్పుడు స్వార్థం కోసం మళ్లీ వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య.  రాజకీయ నాయకులు లేదా ఇతర వ్యక్తులు చేసే తప్పులకి మా  కుటుంబం ఎందుకు సమాధానం చెప్పాలి.  కుటుంబ బలహీనతలను అడ్టుపెట్టుకుని మానసిక క్షోభకు గురిచేశారు.

 ఈ మొత్తం వివాదంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవహరిస్తున్న తీరుపై కూడా పూనమ్ కౌర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమలో ఒక మహిళా ఆర్టిస్ట్‌కు అన్యాయం జరుగుతున్నా, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా 'మా' పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మా అసోసియేషన్ ఇంకా ఎవరి కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి మౌనం వల్ల ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనమైపోవాలి. గతంలోనే ఈమెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ, బాధ్యులైన పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. 

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు నానా పటేకర్ ఉదంతాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన వారు తోటివారికి లేదా బాధితులకు చేసిన వేదన, క్షోభ చెరిగిపోవని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఒక వ్యక్తిని పొగడటానికి మాత్రమే అందరూ అనుమతిస్తూ, ఆ వ్యక్తి వల్ల జీవితం కోల్పోయిన బాధితుల వేదనను పూర్తిగా విస్మరించడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఒకరి మరణానికి సంతాపం తెలపడం ఎంత సహజమో, వారి వల్ల జీవితాంతం నానా ఇబ్బందులు పడుతున్న బాధితుల క్షోభను గుర్తించడం కూడా అంతే ముఖ్యమని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: నానాపటేకర్ నా జీవితాన్ని నరకప్రాయం చేసారు.. ఈవిల్ డెడ్!

 

 

ఇక  గతంలో కూడా పూనమ్ పేరు లేకుండా చేసే పోస్ట్ లు  త్రివిక్రమ్ ని ఉద్దేశించి చేసావే అనే టాక్ ఉండేది. అలాంటిది ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించడం సినీ సర్కిల్స్ లో కూడా సంచలనంగా మారింది. త్రివిక్రమ్ ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం'తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

 

 

[Poonam Kaur Fires At Trivikram, Poonam Kaur, Trivikram Srinivas, Tollywood controversy, Poonam Kaur latest news, MAA association, telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com