Home

»

Latest News

బుట్టబొమ్మకు తప్పని బ్యాడ్ టైమ్.. పూజా హెగ్డే కెరీర్‌లో మరో డిజాస్టర్!

Jun 10, 2026 2:43PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, వరుస బ్లాక్‌బస్టర్లతో అగ్ర స్థానాన్ని అధిరోహించిన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకు ప్రస్తుతం అస్సలు టైమ్ కలిసిరావడం లేదు. గత కొంతకాలంగా ఆమెను పరాజయాల పరంపర తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా విడుదలైన హిందీ చిత్రం సైతం ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా బోల్తా కొట్టడంతో పూజా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్ ధావన్ కథానాయకుడిగా, మృణాల్ ఠాకూర్ మరో కథానాయికగా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాక్సాఫీస్ వద్ద చాపచుట్టేసింది. రొటీన్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో భారీ వసూళ్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సినిమా కమర్షియల్‌గా తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ పరాజయంతో పూజా హెగ్డే ఖాతాలో మరో భారీ డిజాస్టర్ వచ్చి చేరినట్లయింది.

ఈ పరాజయానికి ముందే పూజా నటించిన ‘పెద్ది’ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకుముందు వచ్చిన సూర్య ‘రెట్రో’, షాహిద్ కపూర్ ‘దేవా’, సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇవే కాకుండా రణ్‌వీర్ సింగ్ ‘సర్కస్’, చిరంజీవి ‘ఆచార్య’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రాలు సైతం పూజా కెరీర్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. కేవలం దళపతి విజయ్ సరసన నటించిన తమిళ చిత్రం ‘బీస్ట్’ మాత్రమే యావరేజ్‌గా నిలిచి కాస్త ఊరటనిచ్చింది.

‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పూజా హెగ్డేకు ఆ స్థాయి సక్సెస్ మళ్లీ దక్కలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, సుదీర్ఘ కాలం స్టార్ హోదాలో కొనసాగాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక భారీ విజయం అవసరం. నయనతార, త్రిష, తమన్నా వంటి సీనియర్ భామలు ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్న తరుణంలో.. పూజా కూడా అలాంటి పవర్‌ఫుల్ పాత్రలతో మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్రాక్ రికార్డు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, పూజా చేతిలో ప్రస్తుతం కొన్ని ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ హిందీ రీమేక్ ‘జన నాయకుడు’ లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాంచన 4’ ద్వారా మొదటిసారి హారర్ జానర్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ హారర్ థ్రిల్లర్ తన కెరీర్‌కు గట్టి బ్రేక్ ఇస్తుందని బుట్టబొమ్మ గట్టి నమ్మకంతో ఉంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com