రెహ్మాన్ కి షాక్ ఇచ్చిన పెద్ది టీం.. సంగీత తుఫాన్ మరింత డబుల్
on Jan 6, 2026

-సోషల్ మీడియా వేదికగా పెద్ది టీం ఏం చెప్తుంది
-పెద్ది కి రెహ్మాన్ బలమా!
-ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చిందా!
సంగీతానికే సంగీతాన్ని నేర్పిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ 'ఏ ఆర్ రెహ్మాన్'(Ar Rahman). ఎన్నోసరికొత్త ట్యూన్స్ కి కూడా ఆద్యుడు. సదరు ట్యూన్స్ ద్వారా రెహ్మాన్ సృష్టించిన సంగీత సినీ ప్రపంచాన్ని మూడున్నర దశాబాలపై నుంచే భారతీయ సినీ, మ్యూజిక్ లవర్స్ ఆస్వాదిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రెహ్మాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)కి మ్యూజిక్ ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాల తాలూకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, చికిరి సాంగ్ ద్వారా పెద్ది కి ఏ ఆర్ రెహ్మాన్ ఎంత పెద్ద అసెట్ నో తెలుస్తుంది.
ఈ రోజు ఏఆర్ రెహ్మాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పెద్ది యూనిట్ రెహ్మాన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ రెహ్మాన్ ముఖ చిత్రంతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేసింది. సదరు పోస్టర్ లో 'సంగీత తుఫాన్ కి బర్త్ డే విషెస్. చికిరి పాట కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సాంగ్స్ లలో రెహ్మాన్ సర్ మ్యాజిక్ మరింత గట్టిగా వినిపించబోతోంది. పెద్ది కి సర్ సంగీతం గొప్ప అదనపు బలం. ఆయన మ్యూజిక్ ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేస్తుంది. మార్చి 27న వరల్డ్ వైడ్ గా వస్తున్నాం అని తెలిపింది.
Also read: 52 ఏళ్ళు అయితే 20 లా ఎలా కనిపిస్తున్నావో అర్ధమయ్యింది..ఆ ఐదు ఫాలో అవుతాం
ఇప్పుడు ఈ పోస్టర్ మెగా అభిమానులని, రెహ్మాన్ అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. మార్చి 27 నుంచి రిలీజ్ డేట్ వాయిదా పడుతుందేమో అని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి కూడా సదరు పోస్టర్ చెక్ పెట్టినట్లయింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ జత కడుతుండగా సీనియర్ యాక్టర్స్ శివరాజ్ కుమార్, జగపతి బాబు లు ఈ సారి తమ హవా ని చాలా గట్టిగానే వినిపించే క్యారెక్టర్స్ లో చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



