Home

»

Latest News

Peddi: పెద్ది అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. 8 PM EST,7 PM CST, 5 PM PST

May 6, 2026 12:13PM

 

 

 

 

 

 

 

రైరైరా.. రైరారా అని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)అనడమే కాదు అభిమానులు కూడా రైరైరా.. రైరారా  అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.పెద్ది నుంచి అదిరిపోయే అప్ డేట్ ని మేకర్స్ వెల్లడి చేశారు. 


నార్త్ అమెరికాలో మే 7రాత్రి 8 గంటలకి ESTనుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత 7 PM CST ,  5 PM PST కి షోస్ స్టార్ట్ కానున్నాయి. ఈ మేరకు అధికారకంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ తో ప్రకటించారు   అంటే రిలీజ్ కి  దాదాపు నెల రోజుల ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతుండటం విశేషం. దీన్ని బట్టి పెద్ది కోసం ఫ్యాన్స్ ఎంత వెయిటింగ్ తో ఉన్నారో అర్ధమవుతుంది. ఎన్నో హిట్ చిత్రాలని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన  ప్రముఖ పంపిణీ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ పెద్దిని రిలీజ్ చేస్తుంది.


Also read: Palash Muchhal: ప్రముఖ సంగీత దర్శకుడిపై ఎస్ సి, ఎస్ టి కేసు.. ఫిర్యాదు చేరిన ప్రముఖ నటుడు

వరల్డ్ వైడ్ గా జూన్ 4న థియేటర్లలోకి రానున్న పెద్ది, జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా తన రచ్చ స్టార్ట్ చేయనుంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ  నేపథ్యంలో సాగే పెద్ది లో చరణ్ కి ముక్కు తాడు వేసే అచ్చాయమ్మా గా జాన్వీ కపూర్ చేస్తుండగా  కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గౌరీ నాయుడు గా నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక రోల్స్. ఏఆర్ రెహమాన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్స్ గా నిలవడంతో మిగతా సాంగ్స్ కోసం అందరు వెయిటింగ్.   మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ తో కలుపుకొని  వృద్ధి సినిమాస్ నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడు అనే విషయం తెలిసిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com